మూడో వెబ్ సీరిస్ కు మిల్కీబ్యూటీ గ్రీన్ సిగ్నల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా ముచ్చటగా మూడో వెబ్ సీరిస్ కు పచ్చ జెండా ఊపేసింది. ఇప్పటికే తెలుగులో ‘లెవన్త్ అవర్’, తమిళంలో ‘నవంబర్ స్టోరీ’ వెబ్ సీరిస్ లలో తమన్నా నటించింది. ‘లెవన్త్ అవర్’ బిజినెస్ వరల్డ్ నేపథ్యంలో సాగే వెబ్ సీరిస్ కాగా, ‘నవంబర్ స్టోరీ’ అందుకు పూర్తి భిన్నమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సీరిస్. ఈ రెండు వెబ్ సీరిస్ లలో తమన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో మరికొంతమంది నిర్మాతలు తమన్నాతో వెబ్ సీరిస్ చేసేందుకు ముందుకొచ్చారు. అందులో ఒక దానికి తమన్నా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ భాషల్లో రూపుదిద్దుకోబోతున్న ఈ రొమాంటిక్ డ్రామాను అరుణిమా శర్మ డైరెక్ట్ చేయబోంది. ఈ యేడాది సెప్టెంబర్ నుండి ఇది సెట్స్ పైకి వెళుతుంది. దీనిని దర్శకుడు దినేష్ విజన్ నిర్మించబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు షెడ్యూల్స్ లో చిత్రీకరణ పూర్తి చేసుకునే ఈ వెబ్ సీరిస్ ను 2022లో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయబోతోంది. తమన్నాతో పాటు ఆషిమ్ గులాటీ ప్రధాన పాత్ర పోషించబోతున్న దీనికి ‘యారీ దోస్తీ’ అనే పేరు ఖరారు చేశారట. ఈ వెబ్ సీరిస్ కోసం అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి దినేశ్ విజన్ తో డీల్ కుదుర్చుకుందని వార్తలు వస్తున్నాయి. గత రెండు వెబ్ సీరిస్ కు భిన్నంగా తమన్నా ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉండే లవర్ పాత్రను పోషించబోతోందట. సో… తెలుగు, తమిళ వెబ్ సీరిస్ తర్వాత తమన్నా ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం హిందీ వెబ్ సీరిస్ చేస్తోందని అనుకోవచ్చు.
Also Read
తాజావార్తలు
-
School Bandh: నేడు పాఠశాలలు బంద్.. వరుసగా మూడు రోజుల సెలవులు!
-
Vaibhav Sooryavanshi: “ఆ బుడ్డోడిని ఎలా దెబ్బకొట్టాలో మాకు తెలుసు”.. ఇంగ్లాండ్ దిగ్గజాల సంచలన కామెంట్స్!
-
Senior Hero : సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న హీరో
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Tamil Cinema : హిట్ కొట్టు.. కార్లు పట్టు.. కోలీవుడ్ కొత్త కల్చర్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!