NTV Telugu Site icon

Tamannaah : అందాల తమన్నా.. ఎంత బాగుందో ముద్దుగుమ్మ..

Tamanna

Tamanna

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక పీరియడ్ లో టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. స్టార్ హీరోల ప్రతి సినిమాలోను ఈ ముద్దగుమ్మే ఉండేది. పాలలాంటి తెలుపుతో పాటు వెన్న లాంటి మనసు చక్కటి అభినయం, చూడచక్కని సొగసులు అమ్మడి సొంతం. తన అద్భుతమైన నటనతో తెలుగు నాట విశేషమైన అభిమానాన్ని సంపాదించింది తమ్ము. ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు కాస్త తగ్గినా అప్పుడడప్పుడు స్పెషల్ సాంగ్ లో మెరుస్తుంటుంది.

ఇదిలా ఉండగా తమన్నా కొన్నేళ్లుగా విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉంది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘MCA’‌ సినిమాలో విలన్‌ రోల్ చేసిన అతడే తమ్ము మనసు దోచిన ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌. అయితే ఈ జంట నిన్న ముంబైలోని ఓ దివాళి ఈవెంట్‌ లో పాల్గొన్నారు. బాలీవుడ్ నిర్మాత రమేశ్ తౌరాణి నిర్వహించిన ఈ దివాళి ఈవెంట్‌లో ప్రియుడితో కలిసి పాల్గొన్నతమన్నాస్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. లాంగ్ పింక్ కలర్ డ్రెస్‌లో తుంటరి చూపులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.  ప్రస్తుతం తమన్నా, విజయ్ పోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు తమ్ము ఫ్యాన్స్. త్వరలోనే ఈ హాట్ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా బాలీవుడ్ గుసగుసలాడుతుంది. ఇక సినిమాలు విషయానికి వస్తే మిల్కి బ్యూటీ ఇటీవల శ్రద్ద కపూర్ నటించిన స్త్రీ -2 లో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. ఈ పాట తమ్ము డాన్స్ ఆడియన్స్ కు కిక్ ఎక్కించింది. తమిల్ లో ఒక సినిమాతో పాటు పలు వెబ్సిరీస్ లో నటిస్తోంది తమ్ము.