Takshakudu Teaser: ఆసక్తిగా ‘తక్షకుడు’ టీజర్‌.. సరికొత్త అవతార్‌లో ఆనంద్ దేవరకొండ!

  • ఆనంద్ దేవరకొండ, వినోద్ అనంతోజు కాంబో నుంచి తక్షకుడు
  • తక్షకుడు త్వరలోనే ‘నెట్‌ఫ్లిక్స్’లో విడుదల
  • సరికొత్త అవతార్‌లో ఆనంద్ దేవరకొండ
Takshakudu Teaser

Takshakudu Teaser

‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ సినిమాతో హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు వినోద్ అనంతోజు ప్రేక్షకుల మనసులు గెలిచారు. ఇదే కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తోంది. అయితే ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్‌ను ఎంచుకున్నారు. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చి.. హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌ చేస్తున్నారు. ఆనంద్, వినోద్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘తక్షకుడు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తక్షకుడు సినిమాను నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘వాడు ఇక్కడే ఉన్నాడు, నా కళ్లముందే ఉన్నాడు.. కానీ కనిపెట్టలేకపోతున్నా’ అనే డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. టీజర్‌లో కనిపించిన యాక్షన్ ఎలిమెంట్స్, మిస్టరీ టోన్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఆనంద్ దేవరకొండను ఇంతకు ముందు చూడని కొత్త అవతార్‌లో చూపించడంతో పాటు కథలో మంచి ట్విస్టులు ఉండబోతున్నాయనే సంకేతాలు టీజర్ చూస్తే అర్ధమవుతోంది.

Also Read: Kalki 2898 AD Update: ఆ స్టార్‌కు 90 నిమిషాల స్క్రీన్ టైమ్, రెండు డిఫరెంట్ లుక్స్‌!

ఈ సినిమాలో ‘లాపతా లేడీస్’ ఫేమ్ నీతాన్షీ గోయెల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండనుందని సమాచారం. ఇప్పటికే బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నీతాన్షీ.. ఈ సినిమాలో పూర్తిగా కొత్త రేంజ్ క్యారెక్టర్‌లో కనిపించబోతుందన్న టాక్. ఆమె నటన ఈ థ్రిల్లర్‌కు ఎమోషనల్ డెప్త్‌ను అందించనుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. ఆనంద్, వినోద్ కాంబో నుంచి వస్తున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. టీజర్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత మరింత చర్చకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.