Site icon NTV Telugu

Taapsee Pannu : బక్కచిక్కిపోయిన తాప్సీ లుక్ వైరల్ – హెల్త్‌పై ఫ్యాన్స్ టెన్షన్

Tapsi

Tapsi

ఇండస్ట్రీలో తన ప్రతిభతోనే కాకుండా లుక్, ఫిట్‌నెస్‌తో కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ తాప్సీ పన్ను. కానీ ఇప్పుడు ఆమె తాజా లుక్ ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారారు. ఇటీవల బ్లాక్ ఫ్రాక్‌లో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో తాప్సీ సన్నజాజి, ఫిట్ బాడీతో, స్టన్నింగ్ లుక్‌లో కనిపించడంతో అభిమానుల హృదయాల్లో ఆందోళన కలిగించింది. ఎందుకంటే జీరో సైజ్ నుంచి మైన‌స్ సైజ్‌కి తాప్సీ రావడంతో.. ఇప్పుడు ఆమె హెల్త్ పరంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Lenin : అఖిల్ ‘లెనిన్’ లేటెస్ట్ అప్ డేట్ ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త తరగతి హీరోయిన్‌లు కేవలం రూపం మాత్రమే కాదు, ప్రతిభ, చాణక్యం ద్వారా గుర్తింపును పొందుతున్నారు. అయితే తాప్సీ ఈ జీరో సైజ్ బాడీ కోసం చాలా త్యాగాలు చేస్తున్నారు, దాని వల్ల ఆమె ఆరోగ్యం ప్రభావితం అవుతుందా అని ఫ్యాన్స్ వాపోతున్నారు. తాప్సీ ప్రస్తుతం మూడు ప్రయోగాత్మక చిత్రాల‌పై పనిచేస్తోంది: “వో లుకీ హై కహాన్?”, “గాంధారి”,“ముల్క్ 2”. ఈ మూడు ప్రాజెక్ట్స్ భిన్నమైన కథ శైలులతో రూపొందుతున్నాయి.

ఫ్యాన్స్ ఈ ప్రయత్నాలను అభినందిస్తూ, తాప్సీకి అందించే పేరు, గుర్తింపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ, ఆమె ఆరోగ్యం కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేస్తున్నారు. తాప్సీ ఫిట్ బాడీ కోసం తినడం తగ్గించడం, కొన్ని సందర్భాల్లో సరైన పోషణ తీసుకోకపోవడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఆమెను ప్రతిభలో మరింత మెరుగుపరిచిన, ఆరోగ్యం పరంగా దెబ్బతినవచ్చు. తాప్సీ దాని దృష్టిలో పెట్టుకుంటే   బాగుంటుంది.

Exit mobile version