కరోనా లాంటి మహమ్మారే లేకుంటే… సినిమా సెలబ్రిటీలు ఎక్కిన విమానం దిగిన విమానం అన్నట్టు తిరిగేసేవారు. కానీ, ఇప్పుడు వైరస్ ఎక్కడ లేని తంటాలు తెచ్చి పెట్టింది. ఓ వైపు వర్క్ లేకపోవటం, మరో వైపు ఇంట్లో కూర్చోలేక తల బద్ధలైపోవటం… డబుల్ ప్రెషర్!
చాలా మంది గ్లామరస్ బ్యూటీస్ లాగే తాప్సీ కూడా తన లాక్ డౌన్ ప్రెషర్ అంతా వెకేషన్ ద్వారా తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. ఆమె తన చెల్లెలు షగుణ్ తో కలసి రష్యా బయలుదేరింది. అక్కడ లాంగ్ వెకేషన్ ఎంజాయ్ చేసి వస్తుందట. పన్ను సిస్టర్స్ ఇద్దరికీ రష్యా ఫేవరెట్ డెస్టినేషన్ కావటంతో అమాంతం ఫ్లైట్ ఎక్కేశారు. ఇక మాస్కోలో మాస్కులు లేకుండా తాప్సీ, షగుణ్ ఎలా రచ్చ చేస్తారో వేచి చూడాల్సిందే! అంతే కాదు, ఇప్పుడు చాలా మందికి ఉన్న మరో అనుమానం మన ‘ఝుమ్మంది నాదం’ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ మథియాస్ బోయ్ కూడా రష్యా వెళతాడా? చూడాలి… మరో ఫ్లైట్ లో గాళ్ ఫ్రెండ్ ని ఫాలో అవుతూ వెళ్లే అవకాశాలే ఎక్కువ!
రష్యన్ వెకేషన్ నుంచీ తిరిగి వచ్చాక తాప్సీ ‘హసీన్ దిల్ రుబా’ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేపట్టనుంది. ఆ సినిమా వచ్చే నెలలో ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది. ఇక ‘లూప్ లపెటా’ సినిమా కూడా త్వరలోనే జనం ముందుకి రావాల్సి ఉంది. ఇవే కాకుండా ఇంకా పలు చిత్రాలు తాప్సీ ప్రధాన పాత్రలో నిర్మాణంలో ఉన్నాయి. సో, రష్యా నుంచీ తిరిగి వచ్చాక తాప్సీ ఫుల్ బిజీ అనే చెప్పుకోవాలి…
తాప్సీ రష్యన్ వెకేషన్… మాస్క్ లేకుండా మాస్కోలో మస్తీ!
