Site icon NTV Telugu

Swayambhu Release Date : నిఖిల్ సిద్దార్ధ్ ‘స్వయంభు’ రిలీజ్ డేట్ ఖరారు

Swayambhu

Swayambhu

వరుస ప్లాపులందుకున్న టైంలో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ మార్చేసిన మూవీ కార్తీకేయ. ఆ సినిమా సూపర్ హిట్ తో హిట్ ట్రాక్ ఎక్కిన అఖిల్ సినిమాల ఎంపికను పూర్తిగా చేంజ్ చేశాడు. కార్తికేయకు సీక్వెల్ గా వచ్చిన కార్తీకేయ2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది నిఖిల్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్ తెచ్చుకోవడంతో గ్రాఫ్ డౌన్ అయినట్లు కనిపించింది. దీంతో తర్వాతి సినిమాలపై గట్టిగా ఫోకస్ చేస్తున్నాడు నిఖిల్.

ప్రజెంట్ నిఖిల్ చేతిలో స్వయంభు, ద ఇండియా హౌజ్ చిత్రాలున్నాయి. ఈ రెండు కూడా పీరియడిక్ చిత్రాలే. వాటిలో స్వయంభు సినిమాను దాదాపు రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా స్వయంభు వస్తుందని స్వయంగా నిఖిల్ తెలిపాడు. ఇక ఈ సినిమా కోసం కత్తి యుద్దాలు గుర్రపు స్వారీలలో శిక్షణ కూడా తీసుకున్నాడు. చాలా కాలంగా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా గురించి గత కొంత కాలంగా ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఎంత వరకు వచ్చింది, షూటింగ్ ఫినిష్ అయిందా లేదా అని ఎలాంటి సమాచారం లేదు. ఫైనల్ గా ఇప్పుడు స్వయంభు అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫ్రిబ్రవరి 13న స్వయంభు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టనుందని ప్రకటించారు మేకర్స్.

Also Read : Keerthy Suresh : మహానటి తర్వాత సినిమా అవకాశాలు రాలేదు

Exit mobile version