Site icon NTV Telugu

Susmitha : ప్రతి 8 గంటలకోసారి స్టెరాయిడ్ తీసుకోవాల్సిందే .. లేకపోతే బ్రతకలేను

Susmitha Seen

Susmitha Seen

మిస్ యూనివర్స్ అనేది ఒకటి అంటుందని, ఈ పోటీలలో పాల్గొంటే క్రేజ్ ఎలా ఉంటుందో మొట్టమొదట భారతదేశానికి పరిచయం చేశారు సుస్మితా సేన్.  1994లో కేవలం 18 ఏళ్ల వయసులోనే, మనీలాలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సుస్మితా సేన్ నిలిచిపోయింది. అందం, అభినయం, ప్రతిభ, ఆత్మ విశ్వాసం ఆధారంగా ఆమెకు ఈ ఘనత దక్కింది. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందట. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుస్మిత చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల హృదయాలను తాకాయి.

Also Read : Rana : కొత్తపల్లి‌లో ఒకప్పుడు.. రానా కొత్త ప్రయోగం వర్కౌంట్ అయ్యేనా.. !

కెరీర్ పరంగా ఎంతో బలంగా కనిపించిన ఈ నటి, 2014లో అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన అడిసన్ డిసీజ్ బారినపడినట్టు తాజాగా వెల్లడించింది. సుస్మితాకు అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయడం ఆగిపోయింది. ఫలితంగా ఆమెకు ప్రతి 8 గంటలకు హైడ్రోకార్టిసోన్ అనే స్టెరాయిడ్ తీసుకోవడం తప్పనిసరైంది. ఒకవేళ మిస్ అయితే, అది ప్రాణాంతకం అవుతుంది ఆమె చెప్పడం నిజంగా బాధాకరమైన విషయం. అయితే ఈ పరిస్థితిని ఆమె ఓ బలంగా మార్చుకున్నారు. కేవలం మందుల పైనే ఆధారపడకుండా, వ్యతిరేక దిశలో పయనమవుతూ యోగా, జిమ్నాస్టిక్స్, డైలీ వ్యాయామం ద్వారా శరీరాన్ని మళ్లీ బలంగా మార్చుకున్నారు. ఆమె శ్రమను చూసిన వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ‘ఇది ఒక యుద్ధం.. కానీ నేను నా శరీరానికి ఓ ప్రేమ తో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. అదే నాకు మళ్ళీ జీవితం ఇచ్చింది’ అని తెలిపింది.

Exit mobile version