Site icon NTV Telugu

Surya : సూర్య కోసం భారీ సెట్.. వెంకీ అట్లూరి సినిమా నెక్స్ట్ లెవెల్!

Surya 46

Surya 46

తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ తన అభిమానులను కొత్త కాన్సెప్ట్‌లతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో కలిసి చేస్తున్న కొత్త సినిమా చుట్టూ భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా గురించి మొదటి అప్‌డేట్ వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో కుతూహలం పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా ఈ మూవీపై మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

Also Read : Mana Shankara Varaprasad Garu : చిరు కోసం అనిల్ రావిపూడి డబుల్ డ్యూటీ!

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారంలో మొదలవనుంది. ఈ షెడ్యూల్ చాలా కీలకమని, ఇందులో చిత్రంలోని హై ఇంపాక్ట్ సన్నివేశాలను షూట్ చేయనున్నారు తెలుస్తోంది. అందుకోసం భారీ ఖర్చుతో ఓ స్పెషల్ సెట్ నిర్మిస్తున్నారు. ఈ సెట్ లో యాక్షన్ సీన్స్, ముఖ్యమైన డ్రామాటిక్ సన్నివేశాలు ప్లాన్ చేశారని టాక్. ఇక ఈ సినిమాలో సూర్య వేరియేషన్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. పాత్రలో మాస్ లుక్‌తో పాటు క్లాసీ టచ్ కూడా ఉండబోతోందట. వెంకీ అట్లూరి స్టైల్‌లో ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో హైలైట్ అవుతుందని, అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుందని యూనిట్ టాక్.ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ప్రొడక్షన్ వ్యయంపై కాంప్రమైజ్ లేకుండా సినిమాను నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ సెట్ నిర్మాణం కూడా దీనికి నిదర్శనం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగిసే దశలో ఉన్నాయి.

Exit mobile version