Site icon NTV Telugu

Surya : సూర్య 45 మూవీ టైటిల్ ఫిక్స్..?

Surya 45

Surya 45

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్‌గా రెట్రో మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో టాక్ విషయం పక్కన పెడితే తమిళంలో మాత్రం ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు సూర్య. అందులో ఒకటి ఆర్జే బాలాజీతో మూవీ . వైవిధ్యానికి పెద్ద పీటను ఎప్పుడూ వేసే సూర్య.. అదే కోవలో ఈ సినిమా చేస్తున్నారని సమాచారం. సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.

Also Read: Kayadu Lohar : ‘ది ప్యారడైజ్’ తో సహా వరుస సినిమాలు లైన్ లో పెట్టిన డ్రాగన్ బ్యూటీ..

ఇప్పటికే మేకర్స్ సూర్య ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సూర్య 45 ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. ఏంటీ అంటే ఈ సినిమాకు ‘పెట్టైక్కరన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ‘వెట్టై కరుప్పు’ అనే టైటిల్‌ను లాక్ చేసినట్లు సినీ వర్గాల సమాచారం. త్వరలోనే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారట. ఇక ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఆ సినిమాను, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్.ఆర్. ప్రకాష్ రాజ్, ఎస్.ఆర్. ప్రభు గ్రాండ్ గా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో సాత్విక, యోగి బాబు, నట్టి వంటి పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, మలయాళ భామ అనఘా రవి.. ఆ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version