Site icon NTV Telugu

Surya : సూర్య – వెంకీ అట్లూరి మూవీ పై క్రేజీ అప్ డేట్..

Surya Venky Atluri Movie,

Surya Venky Atluri Movie,

తమిళ స్టార్ హీరో సూర్య, క్లాస్ మేకర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హార్ట్‌ఫుల్ ఎమోషన్లకు పేరుగాంచిన వెంకీ, ఈసారి పూర్తిగా కొత్త కోణంలో, మాస్ యాంగిల్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశ వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఓ భారీ సెట్ వేసి, సూర్యపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సీన్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఇదే సెట్లో గతంలో ‘గుంటూరు కారం’ చిత్రీకరణ జరగడం విశేషం.

Also Read : Kaalidhar Laapata : ఎమోష‌న‌ల్‌గా ఆకటుకుంటున్న అభిషేక్ బ‌చ్చన్ ‘కాళిధర్ లపతా’ ట్రైల‌ర్

ఇక సూర్య ఎనర్జీ, యాక్షన్ స్కిల్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ద్వారా ఆయన మాస్ ఆడియెన్స్‌ను పూర్తిగా మెప్పించనున్నారు. పవర్‌ఫుల్ డైలాగ్స్, ఇంటెన్స్ ఫైట్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌ ఇవన్నీ సినిమాలో స్పెషల్ ఎలివేషన్‌ను తీసుకొస్తాయని అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది జీవీ ప్రకాష్ కుమార్. ‘సూరరై పోట్రు’, ‘జై భీమ్’ వంటి హిట్ ఆల్బమ్‌లు ఇచ్చిన సూర్య-జీవీ కాంబో మరోసారి మ్యూజిక్ మెజిక్ రిపీట్ చేయబోతోంది. వెంకీ అట్లూరి స్క్రిప్ట్‌తో జీవీ ఇప్పటికే మ్యూజిక్ వర్క్ మొదలెట్టినట్లు సమాచారం. ప్రత్యేకమైన సౌండ్‌ట్రాక్ కోసం జీవీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.

Exit mobile version