కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సూర్య. ప్రస్తుతం ఆయన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘కరుప్పు’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, మరోవైపు సూర్య లైనప్‌లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు కొత్త వార్త బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం, సూర్య నటిస్తున్న ఈ కొత్త సినిమాకు జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకమైన పాత్రలో నటించనున్నాడట.
ఫహద్ ఫాజిల్ సౌత్‌లో అత్యుత్తమ నటుల్లో ఒకరు కావడంతో, ఆయన ఎంట్రీతో ఈ సినిమా మీద క్రేజ్ మరింత పెరిగింది. సూర్య ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇక ‘కరుప్పు’ విషయానికి వస్తే ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి, సూర్య – ఫహద్ ఫాజిల్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే వార్త ఫ్యాన్స్‌కి మాస్ ఎక్సైట్‌మెంట్ కలిగిస్తోంది.
