Site icon NTV Telugu

Surya 47 : ఆ మలయాళ దర్శకుడితో సూర్య కొత్త సినిమా?

Surya

Surya

తమిళ సినీ పరిశ్రమలో తన నటనతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రతి సినిమా ద్వారా కొత్తదనం చూపించాలనే తపనతో ముందుకు సాగుతున్న ఆయన, ఒకవైపు యాక్షన్ డ్రామాలు చేస్తే మరోవైపు కంటెంట్ బేస్డ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన ‘జై భీమ్’, ‘సూరరై పోట్రు’ లాంటి సినిమాలు నేషనల్ లెవెల్‌లో ప్రశంసలు అందుకోవడంతో పాటు అవార్డులు కూడా దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా

Also Read : Anirudh : అనిరుధ్‌కు వార్నింగ్ ఇస్తున్న ఆడియన్స్..?

ప్రజంట్ సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ త్వరలోనే థియేటర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే సమయంలో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తో చేస్తున్న సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. వీటికి తోడు, సూర్య మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం ‘సూర్య 47’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనుందని సమాచారం. మలయాళంలో వరుస విజయాలు సాధించిన జీతూ మాధవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారని టాక్. ఆయన తెరకెక్కించిన ‘రోమాంచమ్’ ‘ఆవేశం’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ కావడంతో సౌత్‌లో ఆయనపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇలాంటి క్రియేటివ్ డైరెక్టర్‌తో సూర్య జత కడుతున్నారని వినిపించడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. అదే కాకుండా, ఈ ప్రాజెక్ట్‌ను ఒక ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతోందని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే, సూర్య కెరీర్‌లో ఇది మరో క్రేజీ మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Exit mobile version