NTV Telugu Site icon

Surya 44 : 15 నిమిషాల షాట్.. సింగిల్ టేక్.. సూర్య నటవిశ్వరూపం

Surya 44

Surya 44

తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సూర్య నటించిన కంగువ నవంబరు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సూర్య పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. తాజగా హిందీ ప్రమోషన్స్ ముగించి తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో నేడు ప్రచార కార్యక్రమంలో పాల్గొన బోతున్నాడు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Also Read : Rebal Star : ప్రభాస్ నెక్ట్స్ 5 సినిమాలు.. 5 విభిన్న కథలు..

ఒకవైపు కంగువ షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు తమిళ సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో మరో సినిమాను పట్టాలెక్కించాడు సూర్య. తన సినీ కెరీర్ లో 44వ సినిమాగా కార్తీక్ సుబ్బరాజు సినిమాను తీసుకువస్తున్నాడు.కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో 15న లాంగ్ షాట్ ఒకటి షూట్ చేసాడట దర్శకుడు కార్తీక్. అయితే ఈ షాట్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేసాడట సూర్య. లవ్ అండ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ పూజా హెగ్డే సూర్య సరసన ఆడిపాడనుంది. లాంగ్ గ్యాప్ తర్వాత పూజ చేస్తున్న తమిళ సినిమా ఇదే. ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా 2025 సమ్మర్ లో రిలీజ్ కు రెడీగా ఉంది.

Show comments