Suriya : ఎక్స్‌పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య

Suriya

Suriya

ఎక్స్ పరిమెంట్స్, మేకోవర్స్ వల్ల కల్లెక్షన్స్ రావని కంగువా, రెట్రో చిత్రాలతో త్వరగానే బోధపడింది సూర్యకు. అందుకే ఓల్డ్ ఫార్మాట్‌లోకి వచ్చేసి యాక్షన్ ఎంటర్టైనర్ కరుప్పుతో హిట్ కొట్టేశాడు. తన నుండి తమిళ ఫ్యాన్స్ కమర్షియల్ యాంగిలే కోరుకుంటున్నారని గ్రహించిన సూర్య నెక్ట్స్ కూడా అదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నాడు.
వెంకీ అట్లూరితో కలిసి ఫక్తు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సూర్య. ఏజ్ గ్యాప్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతోంది ఈ ఫిల్మ్. అలాగే ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్‌తో సూర్య 47 ఫినీష్ చేశాడు. ఇది కూడా యాక్షన్ మూవీగా తెరకెక్కించబోతున్నాడట దర్శకుడు. జై బీమ్ ఫేం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సూర్య 48 సోషల్ డ్రామాగా రాబోతోందని సమాచారం. తనపై ప్రయోగాలను చేసుకోవడం మానేసి.. కథల సెలక్షన్స్‌లో డిఫరెన్స్ చూపిస్తున్నాడు సూర్య. ఓ వైపు డిఫరెంట్ కంటెంట్ ప్లస్ కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇక ఈ జులై 23న సూర్య బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు బోలెడు ట్రీట్స్ ఉన్నాయని తెలుస్తోంది. విశ్వనాథ్ అండ్ సన్స్ నుండి సూర్య పాడిన సాంగ్‌తో పాటు, 47వ ప్రాజెక్ట్‌కు సంబంధించి టైటిల్ రివీలయ్యే ఛాన్స్ ఉందని కోలీవుడ్ బజ్.