Kanguva: అంచనాలు పెంచేస్తున్న సూర్య ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ క్రమంలో ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…వెయ్యేళ్ల కిందట ఐదు తెగల మధ్య సాగే పోరాటం నేపథ్యంలో, ఓటమి ఎరుగని ధీరుడైన నాయకుడు కంగువను ఒకవైపు, ప్రస్తుత కాలంలో స్టైలిష్ హీరోను మరోవైపు చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమైంది.
Karuna Kumar: బురదలో పడుకోమంటే పడుకున్నారు. వర్షంలో తడవడమంటే తడిశారు!
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
వెయ్యేళ్ల కిందట కంగువ చేసిన ప్రామిస్ ఏంటి, ఆ మాటను ఈనాటి కథానాయకుడు ఎలా నిలబెట్టాడు అనేది ఆసక్తికరంగా చూపిస్తూ ట్రైలర్ సాగింది. ఒక వీరుడి ప్రతిజ్ఞ ఏంటి ?, అతన్ని మోసం చేసిందెవరు ?, ఆ వీరుడు పునర్జన్మ ఎత్తాడా ?, అతను నిలబెట్టిన గౌరవం ఎలాంటిది ? అనే అంశాలతో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. వెయ్యేళ్ల కిందటి కంగువ ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేశారో, అంతే అల్ట్రా మోడరన్ గా నేటి కథనాయకుడి ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఈ రెండు పాత్రల్లో సూర్య నట విశ్వరూపం కనిపించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘ధీర ధీర కదన విహార..ధీర.’ పాట బీజీఎం “కంగువ” ట్రైలర్ ఇంటెన్సిటీ పెంచింది. “కంగువ” సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేలా ఈ రిలీజ్ ట్రైలర్ ఉండి ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!