సూర్య హీరోగా వచ్చిన కంగువా ప్లాప్ తో ఫ్యాన్స్ డీలా పడ్డారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా కెరీర్ బెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటే బిగ్గెస్ డిజాస్టర్ గా నిలిచింది. దింతో ఇక రాబోయే కార్తీక్ సుబ్బరాజు మూవీపైనే సూర్య ఫ్యాన్స్ గట్టి హోప్స్‌తో ఉన్నారు, ఆమధ్య రిలీజ్ చేసిన బర్త్ డే ప్రమోకు అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాతో పాటు ఆర్జే బాలాజీ డైరెక్టర్‌గా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య. సూర్య కెరీర్ లో45 వ సినిమాగా రానుంది.
Also Read : Kollywood : అభిమానుల్ని టెన్షన్ పెడుతున్న అజిత్, సూర్య
ఇక సూర్యకు సంబందించిన మరో వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో గట్టగా వినిపిస్తోంది. ఆర్జే బాలాజీ సినిమా తర్వాత చేస్తున్న సినిమాపై క్లారిటీ వస్తున్నట్టు ఉంది. తమిళ్ స్టార్ దర్శకులలో వెట్రిమారన్ ఒకరు. ఈ దర్శకుడితో గతంలో సూర్య వాడివాసల్ అనే సినిమాను స్టార్ట్ చేసాడు. కానీ ఎందుకనో మళ్ళి ఈ సినిమాను పక్కన పెట్టాడు సూర్య, అటు వెట్రి మారన్ కూడా ఈ సినిమా నుండి వైదొలిగి విడుదలై సీరిస్ ను డైరెక్ట్ చేసాడు. ఇక సూర్య తో సినిమా ఆగిపోయినట్టే అనుకుంటున్న తరుణంలో వాడివాసల్ తిరిగిస్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నారు. తమిళ సంప్రదాయ జల్లికట్టు నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం సూర్య ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. వెట్రిమారన్ తో సినిమా పట్ల సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు