Suriya 50: ‘కరుప్పు’ హిట్ జోష్‌లో సూర్య.. 50వ సినిమాకు భారీ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య (Suriya) ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ (Karuppu) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తూ గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లాయర్ ప్రీతిగా నటించిన త్రిషతో కలిసి ఆయన చేసిన ఈ కోర్ట్ రూమ్ యాక్షన్ డ్రామా సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ థియేట్రికల్ హిట్‌గా దూసుకుపోతోంది. ఈ జోష్‌లోనే సూర్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ ల్యాండ్‌మార్క్ చిత్రం (Suriya 50) కోసం లైనప్‌ను సెట్ చేసుకున్నారు.
సాధారణంగా ఏ స్టార్ హీరోకైనా తన కెరీర్లో 50వ సినిమా అనేది చాలా స్పెషల్. అందుకే సూర్య కూడా తన ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ కోసం ఒక పవర్ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌ను లైన్లో పెట్టారు. దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) ను నిర్మిస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ (KVN Productions) ఈ భారీ ప్రాజెక్ట్‌ను టేకప్ చేయబోతోంది. ‘జన నాయగన్’ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తర్వాత కేవీఎన్ ప్రొడక్షన్స్ వారు సూర్యను సంప్రదించగా, ఆయన కథా చర్చల అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో కళ్లు చెదిరే భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ల్యాండ్‌మార్క్ మూవీని హ్యాండిల్ చేయడానికి టాలీవుడ్ లేదా కోలీవుడ్‌కు చెందిన ఒక టాప్ స్టార్ డైరెక్టర్‌ను రంగంలోకి దించాలని మేకర్స్ చూస్తున్నారు. ప్రస్తుతం సూర్య బాడీ లాంగ్వేజ్‌కు సూట్ అయ్యేలా ఒక స్టార్ దర్శకుడితో స్క్రిప్ట్ చర్చలు జరుగుతున్నాయి. దర్శకుడు ఫైనల్ అయిన వెంటనే దీనిపై ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!