Site icon NTV Telugu

Surekha Vani : సురేఖా వాణి టాటూ వివాదం.. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్..

Surekha Vanni

Surekha Vanni

సీనియర్ నటి సురేఖా వాణి ఇటీవల ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అందులో ఆమె తన చేతిపై గోవింద నామాలు, శ్రీవారి పాదాల టాటూను చేయించుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఈ వీడియో పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. టాటూ వేయించుకునే సమయంలో సురేఖా వాణి చేసిన ఎక్స్‌ప్రెషన్లు, అరుపులపై కొంతమంది నెటిజన్లు ‘ఇది భక్తి చూపించడమా?’ అని ‘ఈ భక్తి కన్నా, వీడియోల కోసం చేసే డ్రామా ఎక్కువగా కనిపిస్తుంది’ అని విమర్శిస్తున్నారు.

Also Read : Avika Gor : ఎంగేజ్మెంట్ చేసుకున్న యంగ్ హీరోయిన్..

మరి కొందరు ‘దేవుడితో ఇలా ఆటలు అడటం సరైన పద్ధతి కాదు’ అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. మరి కొంత మంది మద్దతుగా స్పందిస్తూ.. ‘ ప్రతీ ఒక్కరికీ తమ భక్తిని వ్యక్తపరచడానికి వారి ఓ రీతి ఉంటుంది, ఇది ఆమె వ్యక్తిగత అభిమానం మాత్రమే.. తక్కువచేసి మాట్లాడడం తగదు’ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. మొత్తానికి, సురేఖా వాణి టాటూ వీడియో తో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నార్మాల్ గానే ముందు నుండి కూడా సురేఖా వాణి తన కూతురు సుప్రిత‌ల మీద నెటిజన్లు ఎప్పుడూ నెగెటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్రతి విషయంలో వారిద్దరినీ ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. వెకేషన్‌లకు వెళ్లినా, పొట్టి బట్టలు ధరించినా, పార్టీలు చేసుకున్నా, పబ్బుల్లో కనిపించిన ఇలా ప్రతి విషయంలో ఈ తల్లీకూతుళ్లను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ టాటూ వీడియో తో మరోసారి వైరల్ అవుతున్నారు.

 

Exit mobile version