Suraj Barjatya: వయెలెన్స్ మధ్య పాత ఫ్యామిలీ ఫార్ములా.. సూరజ్ బర్జాత్యా హిట్ కొట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బాలీవుడ్లో యాక్షన్, వయెలెన్స్ చిత్రాల హవా కొనసాగుతోంది. టాప్ హీరోల నుంచి మిడ్‌రేంజ్ హీరోల వరకు చాలామంది రక్తపాతం, భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వయెలెన్స్ కాకుండా హారర్ థ్రిల్లర్లు, వార్ డ్రామాలు, బయోపిక్‌లు చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రేమకథలు తెరపైకి వస్తున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో సీనియర్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా మాత్రం తనకు బాగా కలిసొచ్చిన కుటుంబ కథలు, ప్రేమ, అనుబంధాలు, విలువలతో కూడిన పాత ఫార్ములాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
దర్శకుడిగా సూరజ్ బర్జాత్యా తన ప్రయాణాన్ని ప్రారంభించి 37 ఏళ్లు గడిచాయి. అయితే ఈ సుదీర్ఘ కెరీర్లో ఆయన తెరకెక్కించిన సినిమాల సంఖ్య కేవలం ఎనిమిది మాత్రమే. తక్కువ సినిమాలే చేసినప్పటికీ.. ప్రతి చిత్రంలోనూ తనదైన ప్రత్యేక శైలిని కొనసాగించారు. కుటుంబ బంధాలు, ప్రేమ, భావోద్వేగాలు, సంప్రదాయ విలువలకు ఆయన కథల్లో పెద్దపీట వేస్తారు. కమర్షియల్ అంశాల కోసం అక్కడక్కడా యాక్షన్ సన్నివేశాలను జోడించినా.. భారీ స్థాయి హింసకు మాత్రం ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. ‘మైనే ప్యార్ కియా’ నుంచి ‘ఉంచాయ్’ వరకు ఇదే పంథాను అనుసరిస్తూ వచ్చారు.
Also Read
- Road Accident: జబర్దస్త్ నటులకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజులకు గాయాలు..!
- Vrushakarma: 'వృషకర్మ' రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ.. ట్రైలర్ ఎప్పుడంటే?
- Kavya-Anirudh Reception: సింధూరం లేదు.. మెహందీ లేదు.. కావ్య మారన్ రిసెప్షన్ స్టైల్‌పై నెటిజన్ల చర్చ!!
- Rashmika-Mysaa: రష్మిక అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ‘మైసా’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ఇప్పుడు సూరజ్ బర్జాత్యా తన తాజా చిత్రం ‘యో ప్రేమ్ మోల్ లియో’తోనూ అదే బాటలో పయనిస్తున్నారు. కుటుంబ బంధాలు, బంధుత్వాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ.. కాస్త భిన్నమైన కథాంశంతో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించారు. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం బాలీవుడ్లో యాక్షన్, థ్రిల్లర్ సినిమాల జోరు కొనసాగుతున్న వేళ.. సూరజ్ తనదైన సున్నితమైన కథతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా ప్రేమ్ పాత్రలో కనిపించబోతున్నారు.
తాజావార్తలు
-
Suraj Barjatya: వయెలెన్స్ మధ్య పాత ఫ్యామిలీ ఫార్ములా.. సూరజ్ బర్జాత్యా హిట్ కొట్టేనా?
-
Road Accident: జబర్దస్త్ నటులకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజులకు గాయాలు..!
-
BM Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇన్ఛార్జీ బీఎం సందీప్ కుమార్ కీలక పిలుపు..
-
AP ZPTC Elections: ఎమ్మిగనూరులో కలకలం.. చెత్తకుప్పలో బ్యాలెట్ పేపర్లు.. రీకౌంటింగ్‌కు డిమాండ్
-
Nitish Setu Controversy: ‘నితీశ్ సేతు’పై రాజకీయ రగడ.. ప్రధాని మోడీ వెళ్లగానే ఆర్జేడీ కార్యకర్తల హంగామా
ట్రెండింగ్
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!