టాలీవుడ్ ప్రేక్షకులకు సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న సుప్రిత నాయుడు, ప్రముఖ నటి శురేఖవాణి కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా సిల్వర్‌స్క్రీన్‌పై తన తొలి అడుగు వేస్తోంది. సుప్రిత ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి చిత్రం “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి.” ఈ చిత్రంలో హీరోగా బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి నటిస్తున్నారు, దర్శకత్వం మల్యాద్రి రెడ్డి వహిస్తున్నారు. ఈ సినిమాను M3 మీడియా బ్యానర్‌పై నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఇంతకుముందు శబరి, విరాజి వంటి చిత్రాలను నిర్మించిన ఆయన, ఈసారి ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వగల వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్నారు.
ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుండి ఒక ప్రత్యేక విశేషం వెలుగులోకి వచ్చింది. సుప్రిత డబ్బింగ్ చెప్తున్న సమయంలో ఆమె తల్లి సురేఖవాణి కూడా హాజరైనట్టు తెలుస్తోంది. కొత్త నటి అయినప్పటికీ, సుప్రిత వేగంగా నేర్చుకుని సహజంగా డైలాగ్స్ చెప్పిన తీరు యూనిట్‌ని ఆకట్టుకుందట. అమర్‌దీప్ – సుప్రిత కొత్త జోడీగా తెరపై కనబడనుండటంతో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. భిన్నమైన పాయింట్‌తో రూపొందుతున్న ఈ సినిమా భావోద్వేగాలతో కూడిన సామాజిక కథగా ప్రేక్షకులను చేరువ్వబోతోంది. ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధ మవుతోంది.
