NTV Telugu Site icon

Supritha: నన్ను క్షమించండి..సుప్రీత వీడియో విడుదల

Bandaru Supritha Hot

Bandaru Supritha Hot

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కరు మీద కేసులు నమోదు అవుతున్నాయి. ముందుగా లోకల్ బాయ్ నాని ఈ మధ్య భయ్యా సన్నీ యాదవ్ అనే ఒక మోటో వ్లాగర్ మీద కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు తెలియక వాటిని ప్రమోట్ చేశామని వాటి జోలికి వెళ్ళవద్దని కోరుతూ వీడియోలు పెడుతున్నారు. వారి బాటలోనే సురేఖ వాణి కూతురు హీరోయిన్ గా మారిన సుప్రీత కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. హోలీ రంగుల్లో తడిసి ముద్దయిన ఆమె తెలిసో తెలియకో ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశానని చెప్పుకొచ్చింది.

Shivaji: నా 25 ఏళ్ల కల ‘మంగపతి’తో తీరింది!

కొంత మంది తెలిసో తెలియకో ఈ యాప్స్ ప్రమోట్ చేశారు. వారిలో నేను కూడా ఒక దాన్ని, అయితే ఇప్పుడు ఆపేసాను. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే వారి మాటలు నమ్మి ఆ యాప్స్ డౌన్లోడ్ చేయవద్దు, ఆల్రెడీ ఉంటే డిలీట్ చేసేయండి. అలాగే అలా ప్రమోట్ చేస్తున్న వారిని ఫాలో అవ్వద్దు అంటూ అని చెప్పుకొచ్చింది. బిగ్బాస్ ఫేమ్ అమరదీప్ హీరోగా మహేంద్రనాథ్ నిర్మాతగా ఒక సినిమా రూపొందుతోంది. అందులో సుప్రీత హీరోయిన్గా నటిస్తోంది. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.