NTV Telugu Site icon

Koratala Siva: శ్రీమంతుడు కథ కాపీ కేసులో కొరటాల శివకు సుప్రీంకోర్టు షాక్

Koratala

Koratala

Supreme Court Schock to Koratala Siva in Srimanthudu Copyright Case: కాపీరైట్స్ కేసులో కొరటాల శివకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. నాంపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కచ్చితంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొరటాల శివ దర్శకుడిగా మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు అనే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే చచ్చేంత ప్రేమ పేరిట తాను రాసిన నవల కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి శ్రీమంతుడు పేరుతో ఒక సినిమా చేశారని డైరెక్టర్ శివ కొరటాల, నిర్మాతలు ఎర్నేని రవి, ఏఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల మీద శరత్ చంద్ర అనే రచయిత ఒక క్రిమినల్ కేసు పెట్టారు. అయితే ఆ క్రిమినల్ కేసును సవాల్ చేస్తూ కొరటాల శివ, ఎర్నేని రవి, ఏఎంబి ఎంటర్టైన్మెంట్ లు వేరువేరుగా ముందుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో కాపీ రైట్‌‌ యాక్ట్ కింద డైరెక్టర్‌‌‌‌ కొరటాల శివ విచారణ ఎదుర్కోవాల్సిందేనని హై కోర్టు గతంలో తేల్చి చెప్పింది.

Viswambhara: సంక్రాంతిపై కన్నేసిన బాసు.. రిలీజ్ డేట్ ఫిక్స్?

అయితే, ఆ మూవీ నిర్మాత ఎర్నేని రవి, ఎంబీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌లపై కాపీ రైట్‌‌యాక్ట్‌‌ కేసు చెల్లదని చెప్పింది. వీళ్లపై ఫోర్జరీ, చీటింగ్‌‌ కేసులు నమోదు చేయాలన్న కథ రచయిత శరత్‌‌ చంద్ర (ఆర్డీ విల్సన్‌‌) అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టులో అపీల్ చేశారు కొరటాల శివ. సుప్రీం కోర్టు కూడా నాంపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కచ్చితంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అని తేల్చి చెప్పింది. శ్రీమంతుడు కథలో స్వల్ప మార్పులు ఉన్నాయని 8 మంది రచయితల కమిటీ చెప్పడంతో డైరెక్టర్‌‌‌‌ కాపీ రైట్‌‌ యాక్ట్‌‌ నిబంధనల ప్రకారం విచారణ ఎదుర్కోవాలి, దర్శకుడే కథా రచయతకు, స్రీన్‌‌ప్లేకు సొమ్ము చెల్లించారని హైకోర్టు పేర్కొంది. కథనంలో మార్పులు చేసి తన కథ అంటే కుదరదు. ఇలాంటి వ్యవహారాలపై విచారణను ఎదుర్కోవాలి అయితే ఈ వ్యవహారంతో నిర్మాతకు సంబంధం లేదని పేర్కొంది.