Site icon NTV Telugu

రజినీకాంత్ షాకింగ్ నిర్ణయం… ఇకపై నో పాలిటిక్స్… !

Superstar Rajinikanth has disbanded ‘Rajini Makkal Mandram’

2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలను విడిచి పెడుతున్నట్లు షాకింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన అనంతరం ఇన్ని నెలల తరువాత తలైవా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రజనీకాంత్ తాజాగా తన సంస్థ “మక్కల్ మండ్రం” భవిష్యత్ గురించి తాజా ప్రకటనలో వివరించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం తనకు లేదని అన్నారు. కాబట్టి రజినీ “మక్కల్ మండ్రం” ఇకపై పని చేయదు.

Read Also : ఉపరాష్ట్రపతిని కలిసిన విశాల్

“ప్రస్తుత పరిస్థితుల కారణంగా మేము అనుకున్నది జరగలేదు. మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన నాకు లేదు” అని వెల్లడించిన రజనీకాంత్ ఈ సంస్థను మంచి పనుల కోసం, అభిమానుల సంక్షేమ సంఘంగా మార్చబోతున్నట్టు తెలిపారు. ఆర్‌ఎంఎం‌లోని కార్యదర్శులు, సహచరులు, డిప్యూటీ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ప్రస్తుతానికి పని చేస్తూనే ఉంటారని ఆయన అన్నారు. రజనీకాంత్ ఈ ఉదయం చెన్నైలో ఆర్‌ఎంఎం సభ్యులను కలుసుకుని ఈ నిర్ణయం ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈ సూపర్ స్టార్ సిరుతై శివ దర్శకత్వంలో పిక్చర్స్ బ్యానర్‌లో కళానిధి మారన్ నిర్మిస్తున్న “అన్నాత్తే” చిత్రంలో నటిస్తున్నారు.

Exit mobile version