Site icon NTV Telugu

పుట్టిన రోజున మొక్కలు నాటిన కృష్ణ

Superstar Krishna accepted Hara Hai Toh Bhara Hai Green India Challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా సూపర్ స్టార్ కృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలానే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటమని కృష్ణను కోరారు. ఆయన కోరిక మేరకు కృష్ణ నానక్ రామ్ గూడాలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి పై ఉన్న బాధ్యత. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. వారు చేస్తున్న కృషికి నేను మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది” అని తెలిపారు. అలానే తన పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలిపిన సంతోష్ కు కృష్ణ కృతజ్ఞతలు చెప్పారు.

Exit mobile version