NTV Telugu Site icon

ARM : విభిన్న చిత్రాలను ఆదరించడంలో తెలుగు ఆడియెన్స్ చాలా గ్రేట్ : టోవినో థామస్

Untitled Design (29)

Untitled Design (29)

మలయాళ  స్టార్ హీరో టోవినో థామస్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. టోవినో  కెరీర్ లో  50 మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. “ARM” సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Q : ఇది మీ50మైల్ స్టోన్ మూవీ.. ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?

A :  స్మాల్ యాక్టర్ గా సపోర్టింగ్, కామెడీ, విలన్ రోల్స్ తో కెరీర్ ప్రారంభించాను. 2016 నుంచి లీడ్ రోల్స్ చేస్తున్నాను. యాక్టర్ కావాలనేది నా కళ.  ARM మొదలుపెట్టినప్పుడు ఇది నా 50వ సినిమా అని తెలీదు. ARM చాలా ఎక్సయిటింగ్ స్క్రిప్ట్. మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం హ్యుజ్ ఛాలెంజ్.  దొంగగా కనిపించే మణి పాత్ర కొంచెం ఎక్కువ ఇష్టంగా కస్టపడి చేశాను.

Q : మీరు ఆరు నెలల్లో కళరి ఫైట్ నేర్చుకున్నారా ? 

A : ఆరు నెలల్లో కళరి నేర్చుకోవడం అనేది చాలా పెద్ద మాట. ఆరు నెలలు కళరి ఫైట్ ప్రాక్టీస్  చేశాను అంటే సమంజసంగా ఉంటుంది.  కొన్ని బేసిక్స్ పై అవగాహన  చేసుకున్నాను.

Q : డెబ్యూ డైరెక్టర్ కు ఇంత ఇంత పెద్ద సినిమా బాధ్యతలు ఎలా  ఇచ్చారు  

A : జితిన్ లాల్ నాకు ఎనిమిదేళ్ళుగా పరిచయం. నా కెరీర్ లో 80శాతం సినిమాలు కొత్త దర్శకులతోనే చేశాను. జితిన్ చెప్పిన స్క్రిప్ట్ చాలా నచ్చింది.

Q : ARM లో ఎదురుకున్న ఛాలెజింగ్ ఏమిటి ?

A :  ఇందులో చాలా ఫైట్స్ సీక్వెన్స్ లు వున్నాయి. ఇందులో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వుంటుంది. టైం పీరియడ్స్ ని ఆడియన్స్ సులువుగా అర్ధం చేసుకుంటారు. డైరెక్టర్ ప్రతి డిటెయిల్ ని చాలా చక్కగా తెరకెక్కించారు.

Q : ARM టైటిల్ గురించి ?

A : ARM.. ‘అజాయంతే రందం మోషణం’. అజయన్ రెండో దొంగతనం అని అర్ధం. ఇతర భాషల వారికి ఈ పేరు పలకడం కాస్త ఇబ్బందిగా వుంటుంది. అందకే అందరూ పలికే విధంగా ARM అని పెట్టాం .

Q : ARM ను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడం గురించి?

A : మైత్రీ మూవీ మేకర్స్ తో నడిగర్’ సినిమా చేశాను. మైత్రీ లాంటి టాప్ డిస్ట్రిబ్యుటర్స్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం నాకు చాలా ఆనందంగా వుంది.

Q : మీ మిన్నల్ మురళికి తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ వున్నారు.. మీ కాంబినేషన్ లో సీక్వెల్ రావచ్చా ?

A : మిన్నల్ మురళి డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా వున్నారు. సీక్వెల్ చేస్తే గనుక మిన్నల్ మురళి కంటే బెటర్ గా వుండే కథ కుదిరినప్పుడే చేయాలి.