ARM : విభిన్న చిత్రాలను ఆదరించడంలో తెలుగు ఆడియెన్స్ చాలా గ్రేట్ : టోవినో థామస్
- టోవినో థామస్ లేటెస్ట్ ఫిల్మ్ ARM
- సెప్టెంబరు 12న గ్రాండ్ రిలీజ్
- తెలుగులో విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. టోవినో కెరీర్ లో 50 మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. “ARM” సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
Q : ఇది మీ50మైల్ స్టోన్ మూవీ.. ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
A : స్మాల్ యాక్టర్ గా సపోర్టింగ్, కామెడీ, విలన్ రోల్స్ తో కెరీర్ ప్రారంభించాను. 2016 నుంచి లీడ్ రోల్స్ చేస్తున్నాను. యాక్టర్ కావాలనేది నా కళ. ARM మొదలుపెట్టినప్పుడు ఇది నా 50వ సినిమా అని తెలీదు. ARM చాలా ఎక్సయిటింగ్ స్క్రిప్ట్. మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం హ్యుజ్ ఛాలెంజ్. దొంగగా కనిపించే మణి పాత్ర కొంచెం ఎక్కువ ఇష్టంగా కస్టపడి చేశాను.
Q : మీరు ఆరు నెలల్లో కళరి ఫైట్ నేర్చుకున్నారా ?
A : ఆరు నెలల్లో కళరి నేర్చుకోవడం అనేది చాలా పెద్ద మాట. ఆరు నెలలు కళరి ఫైట్ ప్రాక్టీస్ చేశాను అంటే సమంజసంగా ఉంటుంది. కొన్ని బేసిక్స్ పై అవగాహన చేసుకున్నాను.
Q : డెబ్యూ డైరెక్టర్ కు ఇంత ఇంత పెద్ద సినిమా బాధ్యతలు ఎలా ఇచ్చారు
A : జితిన్ లాల్ నాకు ఎనిమిదేళ్ళుగా పరిచయం. నా కెరీర్ లో 80శాతం సినిమాలు కొత్త దర్శకులతోనే చేశాను. జితిన్ చెప్పిన స్క్రిప్ట్ చాలా నచ్చింది.
Q : ARM లో ఎదురుకున్న ఛాలెజింగ్ ఏమిటి ?
A : ఇందులో చాలా ఫైట్స్ సీక్వెన్స్ లు వున్నాయి. ఇందులో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వుంటుంది. టైం పీరియడ్స్ ని ఆడియన్స్ సులువుగా అర్ధం చేసుకుంటారు. డైరెక్టర్ ప్రతి డిటెయిల్ ని చాలా చక్కగా తెరకెక్కించారు.
Q : ARM టైటిల్ గురించి ?
A : ARM.. ‘అజాయంతే రందం మోషణం’. అజయన్ రెండో దొంగతనం అని అర్ధం. ఇతర భాషల వారికి ఈ పేరు పలకడం కాస్త ఇబ్బందిగా వుంటుంది. అందకే అందరూ పలికే విధంగా ARM అని పెట్టాం .
Q : ARM ను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడం గురించి?
A : మైత్రీ మూవీ మేకర్స్ తో నడిగర్’ సినిమా చేశాను. మైత్రీ లాంటి టాప్ డిస్ట్రిబ్యుటర్స్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం నాకు చాలా ఆనందంగా వుంది.
Q : మీ మిన్నల్ మురళికి తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ వున్నారు.. మీ కాంబినేషన్ లో సీక్వెల్ రావచ్చా ?
A : మిన్నల్ మురళి డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా వున్నారు. సీక్వెల్ చేస్తే గనుక మిన్నల్ మురళి కంటే బెటర్ గా వుండే కథ కుదిరినప్పుడే చేయాలి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!