సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. పరశురామ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ “సర్కారు వారి పాట” టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. “బ్లాస్టర్” ట్రీట్ అదిరిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఆ టీజర్ దుమ్మురేపింది. నిన్న మొత్తం మహేష్ మేనియానే నడిచింది. టాలీవుడ్ మొత్తం ఓ పండగ వాతావరణం కన్పించింది. ఇక టీజర్ లో మహేష్ లుక్స్, స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉన్నాయి. టీజర్ మహేష్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేసింది. ఇంకేముంది అసలైన సంక్రాంతి మూవీ అంటూ నెట్టింట్లో పెద్ద సంఖ్యలో లైకులు కురిపిస్తూ షేర్ చేశారు. తాజాగా “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అల్ టైం రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ సాధించి అన్ని రికార్డులను బ్లాస్ట్ చేసేసింది. అల్ టైం హైయెస్ట్ బిడ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీగా “సర్కారు వారి పాట” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. 754కే+ లైక్స్ తో దూసుకెళ్లింది. సూపర్ స్టార్ అభిమానులా… మజాకా !
ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన “సర్కారు వారి పాట”
