భర్త రాజ్ కుంద్రా వివాదంతో శిల్పా శెట్టి ‘సూపర్ డ్యాన్సర్ 4’ షోకి దూరం అయింది. ఆమె స్థానంలో ప్రతీ వారం గెస్ట్ జడ్జెస్ వస్తున్నారు. అయితే, ఈసారి సీనియర్ యాక్ట్రస్ మౌసమీ ఛటర్జీతో పాటూ సోనాలి బెంద్రే న్యాయ నిర్ణేతగా వ్యవహరించనుంది. వారిద్దరు కంటెస్టెంట్స్ తో కలసి సరదాగా గడిపారు. ఇక మరో ఇద్దరు జడ్జీలు కొరియోగ్రాఫర్ గీతా, డైరెక్టర్ అనురాగ్ బసు కూడా అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఉత్సాహంగా కనిపించారు.
రానున్న ‘సూపర్ డ్యాన్సర్ 4’ ఎపిసోడ్ లో మౌసమీ ఛటర్జీ, సోనాలి బెంద్రె కెరీర్స్ లోని సూపర్ హిట్ సాంగ్స్ కి కంటెస్టెంట్స్ స్టెప్పులు వేయనున్నారు. అతిథులుగా వచ్చిన ఇద్దరు ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ కూడా స్టేజ్ పై తమ గార్జియస్ మూవ్స్ చూపుతారని సమాచారం. సోనాలి బెంద్రే ఆ మధ్య క్యాన్సర్ తో విదేశానికి వెళ్లి వచ్చింది. విజయవంతంగా ప్రాణంతక వ్యాధి నుంచీ బయటపడింది. గత కొన్నాళ్లుగా ఆమె మీడియా ముందుకు, కెమెరాస్ ముందుకు వస్తోంది. ‘సూపర్ డ్యాన్సర్ 4’ తాజా షోకి సోనాలి స్పెషల్ అట్రాక్షన్ అవ్వనుంది…
