NTV Telugu Site icon

వైర‌ల్ అవుతున్న స‌న్నీ లియోన్ ఐట‌మ్ సాంగ్ స్టిల్స్!

Sunny Leone Special Song Pic Goes Viral from Amdaar Nivas Movie

శృంగార నాయిక స‌న్నీలియోన్ హీరోయిన్ గానే కాదు, ఐట‌మ్ సాంగ్ గ‌ర్ల్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో క‌రెంట్ తీగ‌తో పాటు రాజ‌శేఖ‌ర్ గ‌రుడ‌వేగ‌లోనూ ఐట‌మ్ సాంగ్ చేసింది స‌న్నీ లియోన్. అంతేకాదు… సుదీప్ క‌న్న‌డ చిత్రం కోటిగొబ్బా 3లో ప్ర‌త్యేక గీతంలో అందాలు ఆరేసింది. ఐట‌మ్ సాంగ్ స్పెష‌లిస్ట్ గా మారిపోయిన స‌న్నీ లియోన్ తాజాగా ఓ మ‌రాఠీ చిత్రంలో కోలి వేష‌ధార‌ణ‌లో ఓ పాట‌లో న‌ర్తించింది. ఆమ్దార్ నివాస్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఆమె శాంతాబాయిగా న‌టించింది. ఆమె ప‌క్క‌న పొలిటీషియ‌న్ గెట‌ప్ లో షాయాజీ షిండే స్టెప్పులేయ‌డం విశేషం. స‌న్నీలియోన్ పై చిత్రీక‌రించిన పాట‌కు సంబంధించిన వ‌ర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇదే పాట‌లో రోహిత్ చౌద‌రి కూడా స‌న్నీతో క‌లిసి ఆడిపాడాడు. అత‌ను రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ గా న‌టిస్తున్నాడు. బిగ్ బాస్ సీజ‌న్ 5తో 2012లో పాపులారిటీని సంపాదించుకున్న స‌న్నీ లియోన్ అదే యేడాది జిస్మ్-2లో న‌టించింది. ముగ్గురు పిల్ల‌ల త‌ల్లి అయినా స‌న్నీలోని ఛార్మ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. విక్ర‌మ్ భ‌ట్ రూపొందిస్తున్న ఫిక్ష‌న‌ల్ వెబ్ షో అనామిక‌తో స‌న్నీలియోన్ డిటిట‌ల్ స్పేస్ లోకి ఎంట‌ర్ అవబోతోంది. అలానే ది బ్యాటిల్ ఆఫ్ భీమా కోరేగావ్తో పాటు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ షేరోలో న‌టిస్తోంది. ఈ సినిమాకు తెలుగులో వీర‌మాదేవి అనే పేరు పెట్టారు. ఇది త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా విడుదల‌కానుంది.