NTV Telugu Site icon

‘నీలి’ సుందరి… సన్నీ లియోన్

Sunny Leone Birthday Special

(మే 13న సన్నీ లియోన్ బర్త్ డే)
శృంగార తారగా కోట్లాది మంది మదిని దోచిన సన్నీ లియోన్ వెండితెరపైనా తనదైన బాణీ పలికించింది. నీలి చిత్రాలతో కుర్రకారును కిర్రెక్కించిన సన్నీ లియోన్, సినిమాల్లోనూ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ నీలి సుందరి చిత్రసీమలో అడుగుపెడుతున్న సమయంలో పలు విమర్శలు వినిపించాయి. అన్నిటినీ చిరునవ్వుతో పక్కకు నెట్టి, బిగ్ స్క్రీన్ పైనా, తన అందంతో హిందోళం పాడించింది సన్నీ లియోన్. ఈ నాటికీ ఎంతోమంది రసికాగ్రేసరుల శృంగార రసాధిదేవతగా జేజేలు అందుకుంటూనే ఉంది సన్నీ లియోన్.

కుండబద్దలు…
కెనడాలో కన్నుతెరచిన సన్నీలియోన్ కు భారతీయ మూలాలున్నాయి. ఆమె అసలు పేరు కరెన్ జిత్ కౌర్ వోహ్రా. బాల్యం నుంచీ అందరిలోనూ తన ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతో ఉండేది సన్నీ. కరెన్ జిత్ పేరును ‘సన్నీ’గా మార్చుకొని స్టేజ్ పై మెరుపులు మెరిపించింది. సన్నీ బోల్డ్ గా నటించడమే కాదు, ఏదీ దాచుకోకుండా చెప్పేస్తుంది. పదకొండేళ్ళ ప్రాయంలో తొలిముద్దు రుచి చూశానని చెప్పిన సన్నీ లియోన్ 16వ ఏట ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్ తో తొలిసారి శారీరక సుఖం అనుభవించానని చెబుతుంది. తనలో స్వలింగసంపర్క అభిలాష కూడా ఉందని అంగీకరించింది. వైద్యవృత్తిలో రాణించాలని నర్స్ కోర్సు చదివింది. కానీ, తన 19వ యేట పోర్న్ మూవీస్ లో నటించడానికి సిద్ధమయింది. అప్పటి నుంచీ పలు నీలి చిత్రాలలో సన్నీ లియోన్ అందచందాలతో ఆకట్టుకుంది. 2004లో సన్నీ లియోన్ ‘ద గర్ల్ నెక్ట్స్ డోర్’ సినిమాతో తొలిసారి మెయిన్ స్ట్రీమ్ లో అడుగు పెట్టింది. ఆ తరువాత నుంచీ నీలి చిత్రాల్లో నటిస్తున్నా ఆమె మనసు ఫీచర్ ఫిలిమ్స్ లో నటించడానికి ఉవ్విళ్లూరింది. తన పూర్వికులకు చెందిన భారతదేశంలో నటిగా తన సత్తా చాటాలనుకుంది. ‘జిస్మ్-2’తో తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ‘షూటవుట్ ఎట్ వాడాలా’లో “లైలా….” సాంగ్ లో సన్నీ లియోన్ భలేగా మురిపించింది. “జాక్ పాట్, రాగిణి ఎమ్.ఎమ్.ఎస్.-2” హిందీ చిత్రాల తరువాత ‘వడకర్రీ’ తమిళ చిత్రంతో సౌత్ బాట పట్టింది.

సినిమాలే కాదు…
తెలుగులో మంచు మనోజ్ హీరోగా రూపొందిన ‘కరెంట్ తీగ’లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది సన్నీలియోన్. ఇందులో సంపూర్ణేశ్ బాబు కాబోయే శ్రీమతిగా కాసేపు కవ్వించింది. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘పీఎస్వీ గరుడవేగ’లో “డియో డియో…” సాంగ్ లో కనువిందు చేసింది సన్నీ లియోన్. దక్షిణాది అన్ని భాషల్లోనూ సన్నీ చిందులతో విందు చేసి బల్ పసందుగా సాగింది. సన్నీ ప్రధాన పాత్రలో ‘వీరమదేవి’ అనే తమిళ చిత్రం తెరకెక్కుతోంది. సన్నీలాంటి నీలిచిత్రాల సుందరి అలాంటి పవర్ ఫుల్ రోల్ పోషించడంపై కొన్ని విమర్శలూ తలెత్తాయి. ఏది ఏమైనా సన్నీలియోన్ ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లోనే చిందేసింది. కానీ, నటిగానూ తన సత్తా ఏమిటో చాటుకోవాలన్నదే ఆమె అభిలాష. అందులో భాగంగా కొన్ని సినిమాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం భర్త డేనియెల్ వెబర్, తన ముగ్గురు పిల్లలతో కలసి లాస్ ఏంజెలెస్ లో ఉంది. అమెరికన్ కేన్సర్ సొసైటీకి నిధులు సేకరించడంలోనూ, జంతుసంరక్షణలోనూ సన్నీ తనదైన పాత్ర నిర్వహిస్తోంది. త్వరలోనే ముంబయ్ కి వస్తానంటోంది సన్నీ. మరి రాబోయే చిత్రాలలో సన్నీ ఏ రీతిన తన అభినయంతో ఆకట్టుకుంటుందో చూడాలి.