Site icon NTV Telugu

Sunitha: ప్రవస్తిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశా.. మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది!

Sunitha

Sunitha

పాడుతా తీయగా షో గురించి ఆ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్న కీరవాణి, సింగర్ సునీత, లిరిక్ రైటర్ చంద్రబోస్‌ల గురించి ప్రవస్తి అనే ఒక కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం మీద సునీత స్పందించింది. ఈ మేరకు 14 నిమిషాల 33 సెకండ్లు ఉన్న ఒక వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. రకరకాల చానల్స్‌లో రకరకాల వార్తలు ప్రచురించారు. ఆ అమ్మాయి అనేక యూట్యూబ్ ఛానల్స్‌కి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చింది. న్యూస్ చానల్స్ చెబుతున్న దాని ప్రకారం ఆమె ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది. నేరుగా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ప్రవస్తి, చిన్నప్పటినుంచి నిన్ను బాలు గారు, జానకి గారు, చిత్రమ్మ అందరూ ఒడిలో పెట్టుకున్నట్టే నేను కూడా నీను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశాను. ఇప్పుడు నీకు 19 ఏళ్లు కదా, అలా కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగోదు కదా. చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనేదానికంటే చాలా ముద్దుగా పాడావు అని అనేవారు. నీకు గుర్తుందో లేదో.

Operation Karriguttalu : ఆపరేషన్ కర్రిగుట్టలు.. అసలు ఏం జరుగుతోంది..?

ముద్దుగా ఉండే దానివి, ముద్దుగా పాడే దానివి, చాలా బాగా పాడే దానివి. చిన్నప్పుడు పాడినట్లు 19 ఏళ్ల వయసులో కూడా పాడి ఉంటే సంతోషించే వాళ్లలో మొట్టమొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి అని మేమే ఎక్కువగా చెప్పుకొని మురిసిపోయే పిచ్చి వాళ్లం మేము. ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్లు పర్యంతం అయిపోయి ఏడ్చేసిన సందర్భాల్లో చాలా ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో, మిస్సయ్యావేమో. అలాంటి పరిస్థితి ఈ రోజు ఇంత పెద్దదైపోయి రోడ్డు మీదకు వెళ్లి ఎంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్లగక్కొని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. అంటూ ఆమె సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు మీకోసం.

Exit mobile version