Site icon NTV Telugu

Sundarakanda: ఆగస్టు 27న నారా రోహిత్ ‘సుందరకాండ’

Sundarakanda Movie

Sundarakanda Movie

హీరో నారా రోహిత్ తన మైల్ స్టోన్ 20వ మూవీ ‘సుందరకాండ’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులని అలరించింది. బ్యాచిలర్ గా రోహిత్ పాత్రని ప్రజెంట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. సుందరకాండ హ్యుమర్, సోల్ ఫుల్ రిఫ్రెషింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.

Also Read : AMB: ఏఎంబీలో వీరమల్లు చూసిన జాన్వీ, బుచ్చిబాబు?

ఈరోజు, నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. సుందరకాండ ఆగస్టు 27న గణేష్ చతుర్థి రోజున థియేటర్లలోకి వస్తుంది. బుధవారం విడుదలతో ఈ చిత్రం కు లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది. రిలీజ్ డేట్ పోస్టర్ నారా రోహిత్ జీవితంలోని వివిధ దశలలోని రెండు ప్రేమకథలను ప్రజెంట్ చేస్తోంది. ఇందులో నారా రోహిత్ డిఫరెంట్ టైం లైన్స్ లో కనిపించారు. ఒకటి శ్రీదేవి విజయ్ కుమార్ తో కలిసి మొదటి ప్రేమలోని అమాయకత్వాన్ని చూపించగా, మరొకటి వృతి వాఘానితో కలిసి సెకండ్ లవ్ ఛాన్స్ ని సూచిస్తుంది.

Also Read : Kamakhya: అదిరే అభి డైరెక్షన్లో సముద్రఖని ‘కామాఖ్య’

లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగిల్ బహుసా బహుసా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ప్రదీప్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, రోహన్ చిల్లాలే ఎడిటర్, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్. సందీప్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. దాదాపు నెలలో సినిమా విడుదల కానున్నందున మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేయనున్నారు.

Exit mobile version