Site icon NTV Telugu

Sukumar : ఆర్య షూటింగ్ సమయంలోనే బన్నీకి ఆ ప్రామిస్ చేసా..?

Whatsapp Image 2024 05 08 At 10.41.40 Am

Whatsapp Image 2024 05 08 At 10.41.40 Am

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.తన మొదటి సినిమాతోనే అల్లు అర్జున్ కు సుకుమార్ సూపర్ హిట్ అందించాడు.ఆర్య సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా అను మెహతా నటించింది .దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అలుఅర్జున్ కెరీర్ లోనే క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచింది.అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే ఆర్య సినిమా 20 ఏళ్ళు పూర్తిచేసుకోవడంతో చిత్ర యూనిట్ ఓ స్పెషల్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి ఆర్య సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ హాజరయి సందడి చేసారు.ఈ ఈవెంట్లో సుకుమార్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. సుకుమార్ మాట్లాడుతూ.. ఆర్య సినిమా షూటింగ్ టైంలో ఆర్య హిట్ అయితే బన్నీ నాతో ఏడు సినిమాలు తీస్తానని ప్రామిస్ చేయమని అడిగాడు.నేను కూడా తప్పకుండా చేస్తానని ప్రామిస్ చేశాను అని తెలిపారు.దీంతో సుకుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.అయితే సుకుమార్,అల్లుఅర్జున్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2, పుష్ప రాగా త్వరలో పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో వీరి కాంబినేషన్ లో నాలుగు సినిమాలు పూర్తవుతాయి.ఇక మిగిలిన మూడు సినిమాలు ఎప్పుడు వస్తాయో అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు .ఈ సరి తెరకెక్కే సినిమాలు పుష్ప మూవీని మించి వుంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Exit mobile version