NTV Telugu Site icon

Sukumar : దిల్ రాజు కాళ్ళ మీద పడ్డ సుకుమార్..

Whatsapp Image 2024 05 08 At 9.21.12 Am

Whatsapp Image 2024 05 08 At 9.21.12 Am

టాలీవుడ్ లో అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “ఆర్య”.ఈ సినిమా మే 7 2004 న విడుదలై సూపర్ హిట్ అయింది .ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ టర్న్ అయింది.ఆర్య సినిమాతో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు .స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ సరసన అను మెహతా హీరోయిన్ గా నటించింది.ఆర్య సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచింది.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్ళు పూర్తి అవడంతో ఈ మూవీ యూనిట్ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఆర్య మూవీ లో పనిచేసిన టెక్నిషియన్స్ అంతా వచ్చి ఎంతో సందడి చేసారు.

ఆ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ప్రొడ్యూసర్ దిల్ రాజుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.సినిమాలో ఒక సీన్ షూటింగ్ సమయంలో దిల్ రాజు గారికి నాకు గొడవైంది..ఆ సీన్ మాన్టేజ్ కోసం మరోసారి చేద్దాం అని అడుగగా ఆయన వద్దు అన్నారు.ఆ సీన్ సరిగ్గా రాకుండా సినిమా ఎలా రిలీజ్ చేస్తాం అని అన్నాను .వద్దు ఇప్పటికే చాల డబ్బు ఖర్చు అయింది అని అన్నారు.దీనితో నాకు కోపం వచ్చేసింది .మీరు ప్రొడ్యూసర్ అయితే నాకేంటి అంటూ గొడవ పడ్డాను.ఇక వెంటనే రాజు కాళ్ళు పట్టేసుకున్నాను.ఆ సీన్ ఇంపార్టెంట్ అర్ధం చేసుకోండి అనగానే సరే చేసుకో దిల్ రాజు అన్నట్లు సుకుమార్ తెలిపారు .ఒక సినిమా బాగా రావడం కోసం నేను దేనికైనా కాంప్రమైజ్ అవుతానని సుకుమార్ తెలిపారు .