NTV Telugu Site icon

Sukumar: సుకుమార్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్

Allu Arjun Cryinng

Allu Arjun Cryinng

పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ హాయ్ అండి నేను ఆల్రెడీ చాలా అలసిపోయి ఉన్నాను. కానీ మీతో మాట్లాడాలని వచ్చాను. అందరికీ పేరుపేరునా చెప్పలేను కానీ ఒకటి మాత్రం నిజం నేను బన్నీని ఆర్యతో స్టార్ట్ అయిన నా జర్నీ తను ఎలా ఎదుగుతున్నాడో నేను చూస్తూ వచ్చాను. వ్యక్తిగా ఒక ఆర్టిస్టుగా తన జర్నీ అంతా నేను దగ్గర నుంచి చూస్తున్నాను. స్పెషల్ గా చెప్పాలంటే ఈ పుష్ప అనేది పుష్ప రెండు భాగాలు ఎలా వచ్చింది? ఎలా తయారయింది అంటే ఇది కేవలం అల్లు అర్జున్ మీద ప్రేమ మాత్రమే. మా ఇద్దరి బాండింగ్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. తనతో మాట్లాడుతున్నప్పుడు తనకి ఒక సీన్ చెబుతున్నప్పుడు నాకు వచ్చే ఎనర్జీ ఎప్పుడైనా ఒక సీన్ రావాలని పోరాటం చేస్తాడు. మీరందరూ ఒక ఫైట్ కోసమో ఒక సీక్వెన్స్ కోసమో కాదు ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను. ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఒక ఐ బాల్ లేపాలనో లేక ఒక లిప్ మూవ్ చేయాలనో వాయిస్ లో ఏదో ఒక షవర్ రావాలనో ప్రయత్నం చేస్తాడు అంటే ఒక స్టార్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి పడే తపన అనేది ఒక డైరెక్టర్ కి మామూలు కిక్కు ఇవ్వదు.

Allu Arjun: పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ థాంక్స్

డార్లింగ్ నువ్వు నమ్ము నమ్మకపో నేను కేవలం నేను సినిమా నీకోసమే చేశాను తప్ప మరో కారణం లేదు. నీ మీద ప్రేమ తప్ప మరో కారణం లేదు. ఈ కథ క్రియేట్ చేయడం అంతా నీకోసమే. నీతో సినిమా చేస్తానన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఊరికే జస్ట్ క్యారెక్టర్ ఇలా ఉండవచ్చు అని చెప్పాను. కానీ నా దగ్గర అప్పటికి కదలేదు కానీ నువ్వు నమ్మి నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి క్షణం మనిద్దరం కూర్చున్నప్పుడు నేను సీన్ చెబితే నువ్వు చూపించే తపన ఈ వ్యక్తి కోసం ఏదైనా చేసేయొచ్చు అనిపిస్తుంది. నిజానికి సినిమానే మన ప్రపంచం ఈ సినిమాని ఒక స్థాయికి తీసుకువెళ్లడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ వస్తుంది. ఇలా చెబుతున్న సమయంలో అల్లు అర్జున్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సినిమా నీ పట్ల ప్రేమ తప్ప ఇంకేమీ లేదు అంటూ సుకుమార్ ముగించారు.

Show comments