NTV Telugu Site icon

Sukriti Veni: సుకుమార్ పై సంచలన కామెంట్స్ చేసిన కూతురు

Gasnhi Thatha Cheti

Gasnhi Thatha Cheti

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి తొలిసారిగా ‘గాంధీ తాత చెట్టు’ సినిమాతో ఇండస్ట్రీలోని ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 24న విడుదల కానున్న ఈ మూవీకి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించగా నవీన్‌ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలుగా వ్యావహరించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్‌డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ప్రమోషన్ లో భాగంగా తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మూవీ టీం.

దీనికి సుకుమార్‌, అతని భార్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి సుకృతికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. కానీ యాక్టింగ్‌ మీద ఎప్పుడూ ఇంట్రెస్ట్‌ చూపించలేదు. నా ముందు అల్లరి చేస్తూ తిరిగే నా పాప ఎలా యాక్ట్‌ చేస్తుందో అనే చిన్న సందేహం ఉండేది. కానీ ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. దర్శకురాలు కథ ఎంత గొప్పగా రాసుకుందో అంతే గొప్పగా సినిమా తీసింది’ అంటూ తెలిపాడు. ఇక సుకృతి మీడియా సందర్భంగా మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక సుకృతి మాట్లాడుతూ.. ‘ మా నాన్నని సినీ పరిశ్రమలోని పెద్ద దర్శకుల్లో ఒకడిగా చూడాలని నా కళ అది నెరవేరింది.‘పుష్ప’ మూవీ ఆయనకు ఎంతో గుర్తింపు సంపాదించి పెట్టింది. అయితే ఈ మూవీలో నాకు ఓ పాత్ర ఇవ్వమని నేను మా నాన్న ని అడిగాను. ముందు ఆడిషన్ ఇవ్వు తర్వాత చూద్దాం అని అన్నారు. వర్క్ విషయంలో ఆయనకు అందరూ సమానం. నాకు చిన్నప్పటి నుండి సినిమాలో నటించాలి అని ఏం అనుకోలేదు. కానీ మంచి కథతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే, అవకాశాలు కూడా వస్తాయి అని నా నమ్మకం. ‘గాంధీ తాత చెట్టు’ సినిమా కూడా మంచి కథ అందుకే ఒప్పుకున్నా. మీకు కచ్చితంగా నచ్చుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది.