Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ యాక్టర్ సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ బైలింగ్యువల్ క్రేజీ ప్రాజెక్ట్ ‘మండాడి’. అటు టాలీవుడ్‌లోనూ ఇటు కోలీవుడ్‌లోనూ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మత్స్యకారుల జీవితాలు, తీరప్రాంత నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ సమర్పణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దాదాపు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ డ్రామా రూపుదిద్దుకుంది.
రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సీక్వెన్స్‌లను, ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్లను షూట్ చేశారు. ఈ సినిమాలో సుహాస్, సూరి ఇద్దరూ మునుపెన్నడూ చూడని రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో సుహాస్, సూరి ఒకరికొకరు ఎదురెదురుగా పవర్ఫుల్ లుక్‌లో నిలబడి కనిపిస్తున్నారు. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్ అండ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను ఇస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ యాక్టర్ సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ లాంటి టాప్ స్టంట్ మాస్టర్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు. ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు.
Also Read
- Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
- R. Narayana Murthy: 'కామ్రేడ్' పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
- Legacy: విశ్వక్ సేన్ 'లెగసీ' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్‌నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ 'కామ్రేడ్ కళ్యాణ్'!
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!