NTV Telugu Site icon

Prasanna Vadanam : అరుదైన ఘనత సాధించిన సుహాస్ ప్రసన్న వదనం..

Prasanna Vdanam

Prasanna Vdanam

Prasanna Vadanam : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలను ఎంపిక చేసుకొని సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో ఈ ఏడాది నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ సూపర్ హిట్ అయింది.సుహాస్ కెరీర్ లోనే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా తరువాత సుహాస్ నటించిన శ్రీరంగనీతులు అంతగా ఆకట్టుకోలేదు.రీసెంట్ గా సుహాస్ నటించిన మరో మూవీ ప్రసన్న వదనం .ఫేస్ బ్లైండ్‍నెస్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మే ౩ న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

Read Also :Chandini Chowdary: ఏంటి చాందిని అలా కుదిరిందా.. లేదా సెట్ చేసుకున్నావా.. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్..

థియేటర్స్ లో ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.అర్జున్ వైకే ఈ మూవీకి దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని లిటిల్ థాట్స్ సినిమాస్ పతాకంపై మణికంఠ, ప్రసాద్ రెడ్డి  నిర్మించగా విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి నెల ముగియకముందే మే 24న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.ఈ సినిమా ఓటిటి లో దూసుకెళ్తుంది. ప్రసన్నవదనం సినిమా ఆహా ఓటీటీలో రికార్డుస్థాయి వ్యూస్ సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైల్‍స్టోన్ కూడా క్రాస్ చేసింది. ఈ విషయాన్ని ఆహా ఓటిటి అధికారికంగా వెల్లడించింది.

Show comments