టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.రీసెంట్ గా సుహాస్ హీరోగా నటించిన ”అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా సూపర్ హిట్ గా నిలిచింది .ఈ సినిమాలో సుహాస్ అద్భుతంగా నటించి మెప్పించాడు.ఇదిలా ఉంటే ఈ హీరో మరో కాన్సెప్ట్డ్ బేస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుహాస్ హీరోగా నటించిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వైకె ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ మరియు టిఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు.ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ మరియు రాశి సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేసారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ ‘ప్రసన్న వదనం’ మూవీ మే 3న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.ప్రసన్న వదనం మూవీ ఫస్ట్ కాపీ చూసాము..థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సుహాస్ ధీమా వ్యక్తం చేసారు.నేను నటించిన గత సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని సుహాస్ తెలిపారు. ప్రేక్షకులకు ఈ సినిమా తృప్తిని ఇస్తుంది.ఈ సినిమాలోని సస్పెన్స్ కు ప్రతి ప్రేక్షకుడు సీట్ ఎడ్జ్‌లో కూర్చుని సినిమా చూస్తారని సుహాస్ ఎంతో ధీమాగా తెలిపారు. అలాగే దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ.”ప్రసన్న వదనం” నా మొదటి సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్స్‌లో చూడటానికి మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.ప్రసన్న వదనం మూవీ యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి .ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తాడు అని ఆయన తెలిపారు.