Site icon NTV Telugu

Suhana Khan Glamorous look: కుర్రాళ్లను హీట్‌ ఎక్కిస్తున్న షారుక్‌ కూతురు.. జాకెట్‌ తీసి మరీ..

Suhana Khan Glamorous Look

Suhana Khan Glamorous Look

Suhana Khan Glamorous look: స్టార్ హీరోల కూతుళ్లు ఒక్కోసారి ప్రైమసీ లైఫ్‌ని ఎక్కువగా ఇష్టపడతారు. మరి కొందరైతే.. సోషల్ మీడియా ద్వారా తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీడియా కెమెరాలు ఎలా ఉన్నా తమ గ్లామర్ తో జనాలను ఆకర్షిస్తారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన షారుఖ్ ఖాన్ వారసులు కూడా అప్పుడప్పుడు మీడియా ముందు హైలెట్ అవుతూ ఉంటారు.

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా ఇటీవల తన గ్లామర్ లుక్‌తో ట్రెండింగ్‌లో ఉంది. 22 ఏళ్ల సుహానా ఖాన్‌ బయట కనిపించినప్పుడల్లా కెమెరాలన్నీ ఆమె వైపు తిరుగుతున్నాయి. ఇక ఈసారి కూడా స్టైలిష్ డ్రెస్ లో కనిపించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. డిఫరెంట్ పింక్ కలర్ డ్రెస్ లో అమ్మడు స్లీవ్ లెస్ అందాలను హైలైట్ చేసింది. ఇక చేతిలో జాకెట్ పట్టుకుని జీన్స్ లో కనిపించిన తీరు కూడా హైలైట్ అయింది. సుహానా ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టబోతోందని చాలా కాలంగా కథనాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంపై ఆమె ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకు ముందు ఓ ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ లో నటించింది. అమెరికాలో యాక్టింగ్ కోచింగ్ కూడా తీసుకుంది. అయితే ఇప్పటి వరకు సుహానా ఖాన్ తన బాలీవుడ్ ఎంట్రీపై దృష్టి పెట్టినట్లు లేదు. షారుఖ్ కూడా ఆమెకు పెద్దగా సపోర్ట్ చేయలేదని తెలుస్తోంది. ఇక సుహానా ఖాన్ తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. అప్పుడప్పుడు ఆమె చర్మంపైనా, అందంపైనా ట్రోల్స్ వస్తూ తీవ్ర విమర్శకులకు కౌంటర్లు కూడా ఇస్తోంది. మొత్తానికి సుహానా ఖాన్ గ్లామర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక నటనలో కాస్త మెరుగుపడితే ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
Man Gets 3 Years Jail: అమ్మాయి దుపట్టా లాగిన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష

Exit mobile version