NTV Telugu Site icon

Maa Nanna Superhero: దసరాకి ‘మా నాన్న సూపర్ హీరో’ అంటున్న నవ దళపతి

Maa Nanna Superhero

Maa Nanna Superhero

Sudheer Babu Maa Nanna Superhero Releasing For Dussehra : హరోం హర అనే సినిమాతో నవ దళపతి టాగ్ పెట్టుకున్న సుధీర్ బాబు ఈ సారి ఎమోషనల్ మూవీ ‘మా నాన్న సూపర్‌హీరో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నారు. హరోం హర ఆశించిన ఫలితాన్ని అందించలేక పోయింది. అయినా వెనక్కు తగ్గకుండా జటాధర అనే సినిమా అనౌన్స్ చేసిన ఆయన ఇప్పుడు ‘మా నాన్న సూపర్‌హీరో’తో రెడీ అవుతున్నాడు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమా మేకర్స్ మూవీ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చేశారు. దసరా పండుగ సందర్భంగా మా నాన్న సూపర్‌హీరో విడుదల కానుందని, సినిమాల విడుదలకు బెస్ట్ సీజన్లలో దసరా ఒకటని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

Tollywood: టాలీవుడ్ సూపర్ ఫాస్ట్ – 10 సినిమా న్యూస్..

ఫ్యామిలీస్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే కంటెంట్ ఉన్న ‘మా నాన్న సూపర్ హీరో’ రిలీజ్ కి దసరా పర్ఫెక్ట్ టైమ్ అని మేకర్స్ చెబుతున్నారు. ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ని త్వరలోనే రివిల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ‘మా నాన్న సూపర్‌హీరో’ మూవీ ప్రేమ, అనుబంధంకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్ ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామా అని చెబుతున్నారు. సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, ఆనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్. MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి కో రైటర్స్. రాజు సుందరం మాస్టర్‌ కొరియోగ్రాఫీ చేస్తూనే ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని ప్రారంభించనున్నారు.

Show comments