యంగ్ హీరో సుధీర్ బాబు చివరగా “వి” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అతను “శ్రీదేవి సోడా సెంటర్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నెక్స్ట్ ‘సమ్మోహనం’ దర్శకుడితో రెండవ సారి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు. ఇలా వరుస చిత్రాలతో ఫుల్ జోష్ లో ఉన్న సుధీర్ బాబు తాజాగా ప్రకటించిన చిత్రానికి ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వం వహించబోతున్నారు.
Read Also : దుమ్మురేపుతున్న అజిత్ ‘వాలిమై’ మోషన్ పోస్టర్
ఈయన గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ క్రింద నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఆగష్టు నెల నుండి ప్రారంభమవుతుంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
