Site icon NTV Telugu

Raj B Shetty: మేం సినిమా బానిసలం!

Shetty

Shetty

కన్నడ బ్లాక్ బస్టర్ ‘సు ఫ్రం సో’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులుని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్ కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్‌ సినిమాని ఆగస్ట్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజ్ బి శెట్టి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్ కి ధన్యవాదాలు. మేము ఇండీ ఫిలిం మేకర్స్. మంచి కంటెంట్ తీస్తే మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద వ్యక్తులు సపోర్ట్ చేస్తారని నమ్మకం కలిగింది. ఇంత మంచి కంటెంట్ ని ఆదరిస్తున్న మైత్రి శశికి, నవీన్ కి థాంక్యూ సో మచ్. వారు లేకపోతే మేము ఇక్కడ
ఉండే వాళ్ళం కాదు.

Also Read:Rahul Gandhi: ఓటర్ల జాబితా చూపించడానికి ఈసీకి ఇబ్బందేంటి?

ఈ సినిమా చాలా మంచి ఎంటర్టైనర్. ఈ సినిమా కన్నడలో అద్భుతాలు సృష్టించింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఎప్పుడు చూస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. మంచి సినిమా వస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా గొప్పగా ఆదరిస్తారు. గరుడగమన రిలీజ్ అయినప్పుడు తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన ఆదరణ మర్చిపోలేను. మంచి సినిమాకి తెలుగు ప్రేక్షకులు తప్పకుండా సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ఈ సినిమా మిమ్మల్ని గొప్పగా అలరిస్తుంది’ అన్నారు. అయితే మీడియా ప్రతినిధులలో ఒకరు శెట్టి గ్యాంగ్ కర్ణాటక సినిమాను రూల్ చేస్తుందని అనడంతో తాము రూల్ చేయడం లేదని తాము సినిమాలకు బానిసలమని చెప్పుకొచ్చారు.

Exit mobile version