Prabhas – Nbk : ప్రభాస్ ఫౌజీ – బాలయ్య ‘దాదా’లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్

Fauzi, Dada

Fauzi, Dada

డిసెంబర్ నెల బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాల హోరాహోరీ పోరుకు సిద్ధమవుతోంది. ప్రభాస్ డిసెంబర్ 3న ‘ఫౌజీ’తో, బాలకృష్ణ డిసెంబర్ 24న ‘దాదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఫౌజీ ఇంకా వర్క్ చాలా ఉందని చెప్పిన డేట్ కి ఆసినిమా రాదని మరోసారి పోస్ట్ పోన్ అవుతుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు నటసింహం బాలయ్యకు గాయం కారణంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ‘దాదా’ షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. దాంతో ఈ సినిమా కూడా డిసెంబర్ కు రాదని సమ్మర్ కు వెళుతుందని టాక్ వినిపిస్తుంది.  కూడా 

అయితే ఈ రెండు సినిమాల విషయంలో రిలీజ్ పోస్ట్ పోన్ అనే మాటే లేదని మేకర్స్ నుండి అందిన సమాచారం. అందుకు OTT సంస్థల నుండి ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ కారణమట. ఈ మధ్యకాలంలో ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కొనుగోలు విషయంలో పక్కా నిబంధనలతో ముందుకు వెళ్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ తేదీలను ముందుగానే ఖరారు చేసుకుని, ఒప్పందంలో స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఒకవేళ థియేటర్ విడుదల తేదీలలో ఏదైనా మార్పు ఉంటే లేదా వాయిదా పడితే ఓటీటీ డీల్ మొత్తం ప్రమాదంలో పడే లేదా అగ్రిమెంట్ మొత్తంలో కోతలు పడే అవకాశం ఉంటుంది. ఫౌజీ, దాదా రెండింటికీ సంబంధించిన ఓటీటీ బిజినెస్ భారీ రేట్లకు కొనుగోలు చేశాయి ఓటీటీ సంస్థలు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పెట్టిన కఠినమైన షరతుల దృష్ట్యా, నిర్మాణ సంస్థలు తమ విడుదల తేదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదని నిర్ణయించుకున్నాయి. కాబట్టి ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికే డిసెంబర్‌లో రిలీజ్ కాబోతున్నాయి.