#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది. పోటీలో బడా సినిమాలు ఉన్న కూడా వాటిని వెనక్కి నెట్టి ప్రీమియర్స్ షోస్ నుండే సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 40కోట్లకు పైగా రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది లిటిల్ హార్ట్స్.
Also Read : Deepika And Ranveer : బాలీవుడ్ స్టార్ కపుల్‌కు ఇదేం పైత్యం..
కాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను గత రాత్రి గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు అల్లుఅరవింద్ తో పాటు విజయ్ దేవరకొండ, బండ్ల గణేష్ ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఈ వేడుకలో బండ్ల గణేష్ మాట్లాడుతూ ‘ అందికీ నమస్కారం. నాకు ఏడు, ఎనిమిదేళ్ల తర్వాత నాకు కిక్ ఇచ్చిన ఈ సినిమా లిటిల్ హార్ట్స్. హీరో మౌలీనుద్దేశిస్తూ ఈ ఇరవై రోజులు జరిగినదంతా అబద్దం, ఒక కల్పన, 3D అనుకో కళ్ళ జోడు తీసేయ్. లిటిల్ హార్ట్స్ రిలీజ్ కు ముందు నువ్వున్న స్టేటస్ లోనే ఉండు. నాలాంటోళ్ళు ని దగ్గరకు వచ్చి నీ ముందు మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ ఎందుకు పనికిరారు అంటారు. అవన్నీ నమ్మొద్దు, ఈ ట్వీట్లు, సినిమాలు ఇవ్వని అబద్దం. ఈ మాఫియాకు దూరంగా ఉండు, ఎవరిని నమ్మొద్దు. ఈ టీషర్ట్స్, సెలెబ్రిటీ ట్వీట్స్ అన్ని అబద్దాలు. రియాలిటీలో ఉండు’ అని అన్నారు. బండ్ల గణేష్ వ్యాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.