స్టార్స్ కి తాప్సీ అంటే భయమా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదిన నటిగా పేరు తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది తాప్సీ. అక్కడ ‘పింక్, జుడ్వా 2, తప్పడ్’ వంటి సినిమాలతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. ఇటీవల ‘రష్మీ రాకెట్’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన తాప్సీ గ్లోబల్ యంగ్ లీడర్స్ సమ్మిట్ 2021లో పాల్గొంది. వారితో జరిపిన చాట్‌లో స్టార్స్ కొందరు తనతో సినిమాలు చేయడానికి వెనుకాడుతున్నారని వెల్లడించింది. టాప్ లో ఉన్న నటీనటులే కాదు కొత్తవాళ్లు సైతం తనతో కలసి నటించటానికి సంకోచిస్తున్నట్లు వెల్లడించింది.
పేరు చెప్పకుండా ఓ నటుడు తనతో సినిమా చేయడానికి నిరాకరించినట్లు తెలుపుతూ… తను ద్విపాత్రాభినయం కూడా చేస్తున్న విషయం తెలుసుకుని ‘ఏక్ తాప్సీ కో సంభాల్నా ముష్కిల్ హోతా హై, యహాన్ తో దో హై’ (ఒక్క తాప్సీనే భరించటం కష్టం… ఇక ఇద్దరితోనా) అని కామెంట్ చేసిన విషయాన్ని గుర్తు చేసింది.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ఇక ఇంకోనటుడు ‘ఈ సినిమా చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే చివరికి సానుభూతి మొత్తం అమ్మాయికి వెళుతుంది’ అని చెప్పినట్లు తెలియచేశారు. నిజానికి అదో ప్రేమకథ. అదీ కాక అతనో పెద్ద స్టార్ కూడా. అలాంటి నటుల్లో కొంచెం ఆత్మవిశ్వాసాన్ని కోరుకుంటున్నానని తాప్పీ వ్యాఖ్యానించింది. ఇటీవల దర్శకనిర్మాతలతో సమావేశమైన ప్రతి
సారి తనతో నటించే నటీనటులు కేవలం ఒకటి రెండు సినిమాలు చేసినవారే కనిపిస్తున్నట్లు తెలియచేశారు. ప్రస్తుతం తాప్సీ ప్రతిక్ గాంధీ సినిమాతో పాటు ‘శభాష్ మిత్’, ‘లూప్ లపేటా, వో లడ్కీ హై కహాన్’ వంటి సినిమాలలో నటిస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?