NTV Telugu Site icon

Tollywood : పవన్ కల్యాణ్ ప్రాజెక్ట్‌ నుండి స్టార్ హీరోయిన్ ఔట్ ..

Pawankalyan

Pawankalyan

ప్రజంట్ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ట్రెండింగ్ యంగ్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతుంది శ్రీ లీల. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా సక్సెస్ అందుకున్నారు. ఇలా ప్రస్తుతం వరుస టాలీవుడ్ సినిమాలతో పాటు, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉంది. ఇక త్వరలోనే శ్రీ లీల నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న శ్రీ లీల గురించి, ఓ హాట్ టాపిక్ వైరల్ అవుతుంది.

Also Read: Nayanthara : ఆ డైరెక్టర్ నన్ను షూటింగ్ నుంచి వెళ్లిపోమన్నారు

ఒకేసారి ఏకంగా పదేసి సినిమాలు ఓకే చేసిన ఈ అమ్మడు, ఇప్పుడు డేట్స్ కుదరక ఇబ్బందులు పడుతుంది. ఈ కారణంగా ఓ బడ ప్రాజెక్ట్‌ని కూడా వదులుకోబోతుందట శ్రీ లీల. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న అవైటెడ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఒకటీ రెండు షెడ్యూల్స్ కూడా మేకర్స్ పూర్తి చేశారు. అంతేకాదు వీటిలో శ్రీలీల కూడా పాల్గొంది. కానీ ఇపుడు ఈ బిగ్ ప్రాజెక్ట్‌ని వదులుకుంటే బెటర్ అని శ్రీలీల ఆలోచిస్తున్నట్టు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఆమె ఈ సినిమాకి, మిగతా సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసి కాల్షీట్స్ ఇచ్చింది కానీ, ఇప్పటి వరకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముందు వెళ్లకపోతుండడంతో.. శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆలస్యం అవడం పక్కన పెడితే, అసలు ఎప్పుడు ఈ సినిమా మొదలు అవుతుందో కూడా క్లారిటీ లేదు. ఒకవేళ ఇది మొదలైన.. ఆమె మరో సినిమాకు ఇచ్చిన డేట్స్ మళ్ళీ ఇబ్బందికరంగా మారతాయేమో అని శ్రీలీల ఈ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.