Site icon NTV Telugu

Kollywood : మలేషియాలో స్టార్ హీరో సినిమా ఆడియో లాంచ్.. ఎప్పుడంటే

Vijay

Vijay

తమిళ స్టార్ హీరో నటిస్తున్న చివరి సినిమా జననాయగాన్. విజయ్ కెరీర్ లో 69వ గా రాబోతున్నఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రేమలు బ్యూటీ మమతా బైజు విజయ్ కు కూతురిగా నటిస్తోంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది.

Also Read : War 2 : ఎన్టీఆర్.. హృతిక్.. సలాం అనాలి.. ప్రోమో అదుర్స్

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న జననాయగాన్ 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాకు సంబందించి చెన్నైసినిమా వర్గాల నుండి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. జననాయగాన్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను మలేషియాలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకను ఈ ఏడాది చివరలో డిసెంబరు 27 డేట్ కూడా ఫిక్స్ చేశారట. ఈ సినిమా తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే TVK పార్టీ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం జననాయకుడు షూటింగ్ ను చక చక ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు విజయ్. అటు ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఈ చిత్రం రిలీజ్ ను భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసేలా విజయ్ ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విజయ్ కోసం ఓ రాప్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడట.

Exit mobile version