Site icon NTV Telugu

Prashanth Varma: సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయనున్న స్టార్ దర్శకుడు..ఎవరో తెలుసా..?

Untitled Design (53)

Untitled Design (53)

నేచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించిన ‘ఆ’ చిత్రంతో టాలీవుడ కి పరిచయమయ్యాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. విభిన్న కథాంశంతో వచ్చిన ఆ చిత్రంతో ఇండస్ట్రీని అలాగే నిర్మాతలను ఆకర్షించాడు ప్రశాంత్ వర్మ. తదుపరి సీనియర్ హీరో రాజశేఖర్ కథానాకుడిగా కల్కి చిత్రానికి దర్శకత్వం వహించి యాంగ్రీ యంగ్ మ్యాన్ కు హిట్ అందించాడు. ఆ కోవలోనే బాలనటుడు తేజాసజ్జా హీరోగా జంబి రెడ్డితో సూపర్ హిట్ అందించాడు ఈ దర్శకుడు. ఈ చిత్రం సూపర్ హిట్ తో తేజా సజ్జా తో మరొక సినిమాను ప్రకటించాడు.

ఇటీవల తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘హనుమాన్’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. కాగా ఈ దర్శకుడు దాదాపు 30 కోట్ల వ్యయంతో సొంత ప్రొడక్షన్ ఆఫీసును ఏర్పాటు చేయనున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తదుపరి రానున్న సినిమాలకు సంబంధించిన కథ పరమైన చర్చలు, తదితర పనులు ఇక నుండి ఈ దర్శకుడు నిర్మించబోయే ఆఫీసులోనే ఙరిగిపోతాయని తెలుస్తోంది. అటు ఇటుగా వంద మంది వరకు వివిధ శాఖలకు చెందిన టెక్నీషియన్స్ ఈ ఆఫీసులో పని చేస్తారాని సమాచారం. ప్రశాంత్ వర్మ ఈ భవనాన్ని 20 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసారు. ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ ఙరుగుతోందని త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఈ ప్రొడక్షన్ హౌస్ ఓపెనింగ్ ఉండనుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

కాగా ‘హనుమాన్’ చిత్రానికి సిక్వెల్ గా ‘జై హనుమాన్’ చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. త్వరలో స్టార్ట్ కానున్న నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు ఈ దర్శకుడు.

Also Read: Raviteja: మాస్ మహారాజ్ మిస్టర్ బచ్చన్ టీజర్ ఎప్పుడో తెలుసా..?

Exit mobile version