NTV Telugu Site icon

Tillu: సిద్దూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’.. మాములుగా ఉండదు..

Untitled Design (77)

Untitled Design (77)

DJ టిల్లు తో సిద్దు క్రేజ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో సిద్ధూ సినిమాకు మంచి డిమాండ్.ఆసినిమాకు సిక్వెల్ గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్ట్ ‘తెలుసు కదా’. ఈ చిత్రంతో ప్రముఖ రైటర్ కోన వెంకట్ సతీమణి, ప్రఖ్యాత స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేయనుంది. సరికొత్త కథ, కథాంశంతో సిద్దూ చిత్రం రానున్నట్టు తెలుస్తోంది. హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌కు పేరుగాంచిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

Also Read : Nandamuri : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే.. మ్యాటర్ ఏంటంటే..?

కాగా  ‘తెలుసు కదా’  రెగ్యులర్ షూటింగ్ ఈరోజు గ్రాండ్ గా ప్రారంభమైంది. 30 రోజులు పాటు సాగే ఈ షెడ్యూల్ లో కీలకమైన టాకీ సన్నివేశాలు మరియు సాంగ్స్ షూట్ చేయనున్నారు. సిద్దూ సరసన నటిస్తోన్న రాశి ఖన్నా మొదటి రోజు నుండే షూటింగ్‌లో సిద్దూతో కలిసి జాయిన్ అయింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరొక కథానాయికగా నటిస్తుండగా, వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సినిమలో తన పాత్ర కోసం సరికొత్తలుక్ లో కనిపించేందుకు సిద్ధూ జొన్నలగడ్డ లుక్ ఛేంజ్ చేశాడు. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్.ఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. మోషన్ పోస్టర్ కు థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాకు జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Show comments